Shukra Rashi Parivartan 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏదో ఒక క్రమంలో ఒక రాశిని వదిలో మరో రాశిలోకి సంచారం చేస్తూ ఉంటుంది. అయితే జనవరి 17న శనిగ్రహం కుంభరాశిలోకి సంచారం చేసింది. అయితే ఈ నెల 22న శుక్రుడు కుంభరాశిలోకి సంచారం చేయనున్నాడు. కుంభరాశిలో ఇప్పటికే శని గ్రహం ఉంది. అయితే ఈ రెండు గ్రహాల కలయికల వల్ల అరుదైన యోగం ఏర్పడి.. చాలా రాశులవారు ఊహించని లాభాలు పొందే అవకాశాలున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా చాలా రాశులవారు ఈ క్రమంలో విపరీతమైన అదృష్టాన్ని పొందుతారు. అయితే ఈ సంచారం వల్ల ఏయే రాశులవారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ రాశులవారికి లాభాలే.. లాభాలు:
మేష:
కుంభరాశిలో శుక్రుడు సంచారం చేయడం వల్ల మేష రాశి వారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వ్యాపారాల్లో కూడా ఊహించని లాభాలు పొందుతారు. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నవారికి ఈ క్రమంలో మంచి కంపెనీలో ఉపాధి లభిస్తుంది. అంతేకాకుండా ఈ గ్రహ సంచారం వల్ల వీరు విహారయాత్రకు కూడా వెళ్లవచ్చు. అయితే ఈ క్రమంలో ఎలాంటి పనులు చేసిన భారీ మొత్తంలో లాభాలు పొందుతారు.
మిథున:
శుక్రుడు సంచార ప్రభావం మిథునరాశి వారికి శుభసూచకంగా మారబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా విద్యా రంగానికి సంబంధించిన వ్యక్తులకు ప్రయోజనాలు కలుగుతాయి. ఉద్యోగ రంగంలో ప్రమోషన్స్ కోసం ఎదురు చుస్తున్నవారికి ఈ క్రమంలో లభిస్తాయి. అంతేకాకుండా ఈ సంచార ప్రభావంతో వీరు చాలా రకాల శుభ వార్తలు వింటారు.
సింహ రాశి:
ఈ సంచార ప్రభావం సింహ రాశి వారికి కూడా శుభప్రదంగా ఉండబోతోంది. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేస్తేనే ఊహించని లాభాలు కూడా పొందే అవకాశాలున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
మకరం:
మకరరాశి వారికి ఈ గ్రహ సంచారం వల్ల ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. ఈ క్రమంలో విచ్చల విడిగా కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ప్రమోషన్‌తోపాటు ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ప్రేమ జీవితం బాగుంటుంది. కుటుంబంతో ఆనందంగా గడపడమే కాకుండా విహార యాత్రలకు కూడా వెళ్తారు.
కుంభం:
కుంభ రాశి వారికి శుక్ర సంచారం వల్ల అనుకూల ఫలితాలు లభిస్తాయి. కార్యాలయంలో ఉన్నతాధికారులు సంతోషంగా ఉంటారు. అంతేకాకుండా మీ పని తీరును అధికారులు ప్రశంసిస్తారు. వ్యాపార చేసేవారు ఈ క్రమంలో లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా పెట్టుబడుతు పెడితే భారీగా లాభాలు పొందుతారు.
Also Read: Tax Saving Schemes 2023: ఈ పథకంలో పెట్టుబడి పెట్టండి.. ఆదాయంతోపాటు సూపర్ బెనిఫిట్స్
Also Read: Shubman Gill: ఉప్పల్‌లో పరుగుల ఉప్పెన.. చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి