Solar and Lunar Eclipse 2023: ఈ ఏడాది చివరి సూర్య, చంద్ర గ్రహణాలెప్పుడు, ఆ మూడు రాశులవారికి ఊహించని ధనలాభం

Solar and Lunar Eclipse 2023: హిందూమతంలో సూర్య, చంద్ర గ్రహణాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ప్రతియేటా ఖగోళంలో జరిగే ఓ సాధారణ ప్రక్రియే అయినా జ్యోతిష్యులు మాత్రం విశేషంగానే భావిస్తారు. గ్రహణకాలంతో చాలా విషయాలను ముడిపెడుతుంటారు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 27, 2023, 06:28 AM IST
Solar and Lunar Eclipse 2023: ఈ ఏడాది చివరి సూర్య, చంద్ర గ్రహణాలెప్పుడు, ఆ మూడు రాశులవారికి ఊహించని ధనలాభం

Solar and Lunar Eclipse 2023: అక్టోబర్ నెలలో ఈ ఏడాది చివరి సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పడనున్నాయి. అంటే ఒకే నెలలో రెండు గ్రహణాలు ఏర్పడటం అసాధారణమైన ఘటనగా జ్యోతిష్యులు పరిగణిస్తున్నారు. సాధారణంగా గ్రహణం అనేది అరిష్టానికి సూచనైనా ఈ రెండు గ్రహణాలు మాత్రం 3 రాశులకు మహర్దశ పట్టించనున్నాయి.

ఈ ఏడాది మొత్తం నాలుగు గ్రహణాలున్నాయి. రెండు సూర్య గ్రహణాలు కాగా రెండు చంద్ర గ్రహణాలు. ఈ ఏడాది చివరి సూర్య , చంద్ర గ్రహణాలు అక్టోబర్ నెలలో ఏర్పడనున్నాయి. హిందూ జ్యోతిష్యం ప్రకారం ఒకే నెలలో రెండు గ్రహణాలు ఏర్పడటం వల్ల 12 రాశులపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా 3 రాశులకు మాత్రం సానుకూలంగా ఉంటుందంటున్నారు జ్యోతిష్యులు. ఇంట్లో ధన సంపదలు వచ్చిపడతాయి. ఏదైనా శుభ కార్యం జరగవచ్చు. ఊహించని ధనలాభం కలుగుతుంది. 

వైదిక శాస్త్రం ప్రకారం ఈ ఏడాది చివరి సూర్య గ్రహణం అక్టోబర్ 14న ఏర్పడనుండగా, చంద్ర గ్రహణం అక్టోబర్ 29న ఏర్పడుతోంది. చివరి చంద్ర గ్రహణమైతే ఇండియాలో కన్పించనుంది. దాంతో సూతక కాలం వర్తిస్తుందంటున్నారు. మొదటి చంద్ర గ్రహణం ఇండియాలో కన్పించలేదు. సూతక కాలం సందర్భంగా ఆలయాలు మూసి వేస్తారు. పూజలు చేయకూడదు. ఆ సమయంలో తిండి కూడా తినకూడదంటారు.

రెండు గ్రహణాలు ఏర్పడటం వల్ల అక్టోబర్ నెల తులా రాశి జాతకులకు శుభప్రదంగా ఉండనుంది. పెండింగులో లేదా నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ఉద్యోగ వ్యాపారులకు వృద్ధి ఉంటుంది. పనిచేసేచోట కొత్త బాధ్యతలు లభిస్తాయి. కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. డబ్బులకు సంబంధించి శుభవార్త వింటారు. ఆర్ధికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ అవసరం. ముఖ్యంగా ఇంట్లో పెద్దవారి ఆరోగ్యంపై కాస్త అప్రమత్తంగా ఉండాలి. గ్రహణ కాలంలో సూచనల్ని పాటించాలి.

మిధున రాశి జాతకులకు సూర్య గ్రహణం కారణంగా ఆర్ధికంగా లబ్ది పొందే అవకాశాలు చాలా ఉంటాయి. ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగవచ్చు. సమాజంలో మీ ఎదుగుదల, గౌరవ మర్యాదలు ఉంటాయి. సోదర సోదరీమణుల మధ్య బంధం పటిష్టంగా ఉంటుంది. ఏదైనా కొత్త వాటిలో పెట్టుబడులు పెట్టవచ్చు. ఆర్ధికంగా ఇబ్బందులు ఉండవు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

గ్రహణం ప్రభావంతో సింహ రాశి జాతకులకు చాలా అనుకూలంగా ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారులకు అమితమైన లాభాలు కలుగుతాయి. ఆర్ధికంగా పటిష్టమైన స్థితిలో ఉంటారు. ఇంట్లో కొత్త వాహనం లేదా సంపద రావచ్చని అంచనా. ఉద్యోగులకు కొత్త అవకాశాలు కలుగుతాయి. తద్వారా మరింత ముందుకెళ్లేందుకు వీలవుతుంది. కీలకమైన పదవి లభించవచ్చు. 

Also read: Zodiac Sign: త్వరలోనే ఈ రాశులవారి జీవితాల్లో పురోగతి, ఆనందం, శ్రేయస్సు పెంపు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News