Eclipse and Temples: ఈ ఏడాది సూర్య, చంద్ర గ్రహణాలు ఎప్పుడు, ఆలయ తలుపులు ఎప్పుడు మూతపడనున్నాయి..

Eclipse and Temples: రానున్న రెండు నెలల్లో వరుసగా సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పడనున్నాయి. ఈ క్రమంలో ఆలయాలు మూతపడనున్నాయి. అటు తిరుమల తిరుపతి దేవస్థానం సైతం ఇదే ప్రకటన చేసింది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 7, 2022, 05:22 PM IST
Eclipse and Temples: ఈ ఏడాది సూర్య, చంద్ర గ్రహణాలు ఎప్పుడు, ఆలయ తలుపులు ఎప్పుడు మూతపడనున్నాయి..

Eclipse and Temples: రానున్న రెండు నెలల్లో వరుసగా సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పడనున్నాయి. ఈ క్రమంలో ఆలయాలు మూతపడనున్నాయి. అటు తిరుమల తిరుపతి దేవస్థానం సైతం ఇదే ప్రకటన చేసింది. 

హిందూ మత విశ్వాసాల ప్రకారం గ్రహణాలున్నప్పుడు ఆలయాల్ని మూసివేస్తారు. భక్తుల సందర్శన ఉండదు. రానున్న రెండు నెలల్లో వరుసగా సూర్య, చంద్ర గ్రహణాలుండటంతో మరోసారి ఆలయాలు మూతపడనున్నాయి. అక్టోబర్ 25వ తేదీన సూర్య గ్రహణం, నవంబర్ 8వ తేదీన చంద్ర గ్రహణం ఉన్నాయి.

ఈ క్రమంలో అక్టోబర్ 25, నవంబర్ 8 తేదీల్లో 12 గంటలపాటు శ్రీవారి ఆలయం మూతపడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. అన్ని రకాల దర్శనాలు రద్దు చేస్తామని తెలిపింది. కేవలం సర్వ  దర్శనం భక్తులకు మాత్రమే అనుమతి ఉంటుంది. సూర్య, చంద్ర గ్రహణాల సందర్భంగా బ్రేక్ దర్శనం, శ్రీ వాణి, 300 రూపాయల ప్రత్యేక దర్శనం, ఆర్జిత సేవల్ని టీటీడీ రద్దు చేసింది. 

అక్టోబర్ 25 సూర్య గ్రహణం

అక్టోబర్ 25 సూర్య గ్రహణం మంగళవారం సాయంత్రం 5.11 నిమిషాల్నించి 6.27 నిమిషాల వరకూ ఉంటుంది. ఈ క్రమంలో ఉదయం 8.11 నిమిషాల్నించి రాత్రి 7.30 నిమిషాలవరకూ శ్రీవారి ఆలయం తలుపులు మూసి ఉంటాయి. బ్రేక్ దర్శనం, శ్రీవాణి, ప్రత్యేక దర్శనం, వృద్ధులు, వికలాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులు, రక్షణ సిబ్బంది, ఎన్ఆర్ఐ దర్శనం, ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవల్ని టీటీడీ రద్దు చేసింది. 

నవంబర్ 8న చంద్ర గ్రహణం

నవంబర్ 8వ తేదీ మంగళవారం మద్యాహ్నం 2.39 నిమిషాల్నించి సాయంత్రం 6.27 నిమిషాలవరకూ చంద్ర గ్రహణం ఉంటుంది. ఉదయం 8.40 నిమిషాల్నించి రాత్రి 7.20 నిమిషాల వరకూ తిరుమల ఆలయ తలుపులు మూసి ఉంచనున్నారు. ఈ సందర్భంగా సర్వదర్శనం కాకుండా మిగిలిన అన్ని సేవల్ని టీటీడీ రద్దు చేసింది. 

Also read: Sun Transit 2022: సెప్టెంబర్ 17 వరకూ ఆ నాలుగు రాశుల జాతకానికి తిరుగే లేదు..అంతా డబ్బే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News