Transit Of Sun into Gemini Sign 2023: జ్యోతిష్య శాస్త్రంలో తొమ్మిది గ్రహాలకు తండ్రిగా భావించే సూర్యుడు త్వరలో గ్రహ సంచారం చేయబోతున్నాడు. ఈ సంచారం జూన్ 15 సాయంత్రం 6:07 గంటలకు మిథునరాశిలోకి సూర్యుడు వెళ్లబోతున్నాడు. ఈ సూర్యగ్రహం నెల పాటు మిథునరాశిలో ఉండి జూలై 16 ఉదయం 4:59 గంటలకు కర్కాటకరాశిలో సంచారం చేయబోతున్నాడు. ఈ సంచార ప్రభావం అన్ని రాశులవారిపై సమానంగా పడే అవకాశాలున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సంచారం కారణంగా ఏయే రాశులవారిపై ప్రభావం పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ రాశులవారిపై ప్రభావం:
సింహరాశి:
సూర్య గ్రహం మిథున రాశిలోకి సంచారం చేయబోతోంది. కాబట్టి ఈ క్రమంలో అన్ని రాశులవారితో పాటు సింహ రాశివారిపై ప్రభావం పడుతుంది. వీరి ఈ సంచారం కారణంగా ఆర్థికంగా చాలా రకాల లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఈ రాశివారు పెట్టుబడులు పెట్టడం కారణంగా భారీ లాభాలు కలుగుతాయి. మీరు చేసే పనుల్లో ఆటంకాలు ఎదురైతే ఈ సంచారం వల్ల సులభంగా తొలగిపోతాయి. షేర్ మార్కెట్ పెట్టుబడి పెట్టేవారికి కూడా చాలా రకాల లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
వృషభ రాశి:
సూర్యుడు వృషభరాశి నుండి ద్వితీయ రాశిలోకి సంచారం చేస్తే ఏ రాశివారికైనా ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ క్రమంలో సూర్యుడు కూడా ద్వితీయ రాశిలోకే సంచారం చేయబోతోంది. దీని కారణంగా వృషభ రాశివారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది.
కన్యారాశి:
మిథునరాశిలో సూర్యుని మంచి సమయంలో సంచారం చేయబోతున్నాడు. దీంతో కన్యారాశి వారి జీవితాల్లో మార్పులు చేర్పులు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సంచారం కారణంగా వ్యాపారంలో చాలా రకాల లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు ఏర్పడతాయి. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారికి చాలా లాభదాయకంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి