These 3 Zodiac Signs will get unexpected money due to Shatabhisha Nakshatra 2023: జ్యోతిషశాస్త్రంలో రాశిచక్రం లేదా గ్రహాల సంచారానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. 2023 జనవరి 17న కర్మను ఇచ్చే దేవుడు శని తన రాశి చక్రాన్ని మార్చుతున్నాడు. 30 సంవత్సరాల తర్వాత శని గ్రహం 2023 జనవరి 17న తన సొంత రాశి కుంభ రాశిలోకి శని ప్రవేశించబోతోంది. మకర రాశిని విడిచిపెట్టిన శని.. కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు. 17న రాత్రి 8:02 గంటలకు మకర రాశి నుంచి కుంభ రాశిలోకి శని ప్రవేశిస్తాడు. ఈ శని సంచారం కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది.
ఆపై 2023 మార్చి 15న శతభిషా నక్షత్రంలోకి శని ప్రవేశిస్తాడు. జ్యోతిషశాస్త్రంలో ఈ నక్షత్ర మార్పు చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఈ నక్షత్రంలో రాహువు ఆధిపత్యం వహిస్తాడు. శని మరియు రాహువుల మధ్య స్నేహ భావం ఉంటుంది. ఈ పరిస్థితిలో శని మార్పు కొన్ని రాశుల వారికి ప్రయోజనాలను ఇస్తుంది. ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.
సింహ రాశి:
శని నక్షత్ర మార్పు సింహ రాశి వారికి అదృష్టం వరిస్తుంది. వైవాహిక జీవితంలో మధురమైన సంబంధాలు ఏర్పడతాయి. భాగస్వామ్య పనులలో విశేష విజయం ఉంటుంది. కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి. అధిక ధనలాభం ఉంటుంది.
మకర రాశి:
శని రాశి మార్పు మకర రాశి వారికి విశేషంగా ఫలప్రదం కానుంది. ఈ సమయంలో కెరీర్లో పురోగతికి అవకాశాలు ఉన్నాయి. ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది. దాంతో ఆర్థిక స్థితి బలపడుతుంది. కోర్టు వ్యవహారాల్లో విజయం ఉంటుంది.
మిధున రాశి:
శని గ్రహం శతభిషా నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల మిథున రాశి వారికి శుభ ఫలితాలు ఉంటాయి. ఈ సమయంలో అదృష్టం మీ వెంటే ఉంటుంది. ప్రతి పనిలో విజయం పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్‌కు అవకాశం ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకు లాభాలు చేకూరుతాయి. ధనలాభం భారీగా ఉంటుంది.
Also Read: Best Mileage Bike: ధర తక్కువ.. మైలేజ్ ఎక్కువ! ఈ బజాజ్ స్టైలిష్ బైక్ ధర 75 వేలు మాత్రమే
Also Read: Prithvi Shaw Record: చరిత్ర సృష్టించిన పృథ్వీ షా.. సచిన్, ధోనీ, కోహ్లీలకు కూడా సాధ్యం కాలేదు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.