Chandra Grahan 2022: మే 16న ఏర్పడనున్న సంపూర్ణ చంద్రగ్రహణం...బ్లడ్ మూన్ భారతదేశంలో కనిపిస్తుందా?

Chandra Grahan 2022: ఈ సంవత్సరం మే 16 తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు, కాబట్టి సూతకాల కాలం చెల్లదు.  

Edited by - ZH Telugu Desk | Last Updated : May 14, 2022, 12:20 PM IST
Chandra Grahan 2022: మే 16న ఏర్పడనున్న సంపూర్ణ చంద్రగ్రహణం...బ్లడ్ మూన్ భారతదేశంలో కనిపిస్తుందా?

Chandra Grahan 2022: ఈ ఏడాది తొలి సంపూర్ణ చంద్రగ్రహణం (Lunar Eclipse 2022) మే 15-16 తేదీల్లో ఏర్పడనుంది. అయితే, ఈ సీజన్‌లో మొదటి గ్రహణం ఏప్రిల్ 30, 2022న ఏర్పడింది మరియు ఇది పాక్షిక సూర్యగ్రహణం. చంద్రగ్రహణం మూడు రకాలు - సంపూర్ణ చంద్రగ్రహణం, పాక్షిక చంద్రగ్రహణం మరియు పెనుంబ్రల్ చంద్రగ్రహణం. చంద్రుడు భూమికి కొంచెం వెనుకగా తన నీడలోకి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. 

సంపూర్ణ చంద్రగ్రహణం (బ్లడ్ మూన్) ఎక్కడ కనిపిస్తుంది?
ఈ సంపూర్ణ చంద్రగ్రహణం (Blood moon) యొక్క మొత్తం దశ ఉత్తర మరియు దక్షిణ అమెరికా అంతటా, ఐరోపా మరియు ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల నుండి కనిపిస్తుంది. దక్షిణ/పశ్చిమ యూరప్, దక్షిణ/పశ్చిమ ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రం మరియు అంటార్కిటికాలోని చాలా ప్రాంతాలు గ్రహణం యొక్క కొన్ని భాగాలను చూస్తాయి. 

గ్రహణం ఏర్పడే సమయం
ఈ గ్రహణం మొత్తం దశ యొక్క వ్యవధి 1 గంట 25 నిమిషాలు మరియు పాక్షిక దశ రెండు గంటల కంటే ఎక్కువ ఉంటుంది. భారతదేశంలో ఈ గ్రహణం కనిపించదు. ఇది మే 16 ఉదయం 7:02 గంటలకు ప్రారంబమై... మధ్యాహ్నం 12:20 గంటలకు ముగుస్తుంది. ఈ ఖగోళ సంఘటనను నాసా (NASA) ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఈ మే 15-16 తేదీల్లో ఏర్పడే ఈ గ్రహణాన్ని సూపర్ ఫ్లవర్ బ్లడ్ మూన్ అని కూడా అంటారు.

Also Read: Jyeshta Month 2022: మే 17 నుండి జ్యేష్ఠ మాసం ప్రారంభం... ఈ 8 పనులు చేసిన వారికి అదృష్టం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News