Chandra Grahan 2022: ఇవాళ ఏర్పడే సంపూర్ణ చంద్రగ్రహణం (Total Lunar Eclipse 2022) ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో మాత్రమే కనిపిస్తుంది. మనదేశంతోపాటు ఇతరదేశాల్లో పాక్షిక చంద్రగ్రహణం కనిపిస్తుంది. ఇప్పుడు చంద్రగ్రహణాన్ని చూడకపోతే 2025 వరకు మీరు చూడలేరు. ఈరోజు అంటే నవంబరు 8, మంగళవారం నాడు ఏర్పడబోయే చంద్రగ్రహణం దాదాపు 85 నిమిషాలపాటు ఉంటుంది. చంద్రగ్రహణం కనిపించే తీరు టైమ్‌జోన్‌పై ఆధారపడి ఉంటుంది.
చంద్రుడితోపాటు ఈ గ్రహాలను కూడా చూసేయండి..
గ్రహణం రోజు రాత్రి మరికొన్ని గ్రహాలు కూడా కనిపించనున్నాయి. మీ దగ్గర మంచి బైనాక్యులర్ ఉంటే ఈ అరుదైన దృగ్విషయాన్ని చూడవచ్చు. చంద్రుడితోపాటు యురేనస్, శని మరియు బృహస్పతి గ్రహాలను చూడవచ్చు. న్యూజిలాండ్ మరియు క్వీన్స్‌లాండ్ ప్రజలైతే నాలుగు ఎరుపు రంగు గ్రహాలైన చంద్రుడు, అల్డెబరాన్, బెటెల్గ్యూస్ మరియు మార్స్ లను చూస్తారు.
చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చినపుడు చంద్రగ్రహణం ఏర్పడింది. ఇది సాధారణంగా పౌర్ణమి రోజు రాత్రి ఏర్పడుతుంది. ఈ సమయంలో చంద్రుడు, భూమి, సూర్యుడు ఒకే సరళరేఖలో వుండాలి. పౌర్ణమి నాటి చంద్రుడు ఎర్రగా కనిపిస్తే "బ్లడ్ మూన్" అని పిలుస్తారు. చంద్రుడు కొద్ది భాగం మాత్రమే భూమి యొక్క ఛాయలోకి ప్రవేశించినపుడు దానిని పాక్షిక చంద్రగ్రహణం అనీ పూర్తిగా భూమి ఛాయలోకి ప్రవేశించినపుడు దానిని సంపూర్ణ చంద్రగ్రహణం అనీ అంటారు.
Also Read: Chandra Grahan 2022: నేడే చంద్రగ్రహణం.. ఈ రోజు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Lunar Eclipse: ఇవాళ చంద్రునితోపాటు కనిపించనున్న మరో 3 పెద్ద గ్రహాలు.. అవేంటో తెలుసా?