Varun Grah Rashi Parivartan 2022: ఆస్ట్రాలజీలో కూడా వరుణ గ్రహ ప్రస్తావన ఉంది. ఇది భూమికి చాలా దూరంలో ఉంటుంది. 14 ఏళ్ల తర్వాత సెప్టెంబర్ 11, 2022న వరుణ గ్రహం తన రాశిని మార్చి... మధ్యాహ్నం 03:11 గంటలకు కుంభరాశిలోకి (Neptune Transit in Aquairus 2022) ప్రవేశిస్తుంది. వరుణ గ్రహాన్ని నెప్ట్యూన్ అని కూడా అంటారు. వరుణ గ్రహం ఒక రాశి నుంచి మరో రాశికి వెళ్లేందుకు 14 ఏళ్లు పడుతుందని, తద్వారా 164 ఏళ్లలో రాశిచక్రం పూర్తవుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
జాతకంలో వరుణ గ్రహం ఉన్నట్లయితే ఆ వ్యక్తి లైఫ్ అద్భుతంగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. కుంభరాశిలో నెప్ట్యూన్ మారడం వల్ల కొన్ని రాశులవారు భారీగా డబ్బు సంపాదిస్తారు. అనతి కాలంలో ధనవంతులు అవుతారు. వరుణ గ్రహ సంచారం ఏ రాశివారికి ప్రయోజనకరంగా ఉండబోతుందో తెలుసుకుందాం.
ఈ రాశుల వారికి అదృష్టం
వృషభం (Taurus)- వరుణ గ్రహ రాశిమార్పు ఈ రాశివారికి గోల్డెన్ డేస్ ను తెస్తుంది. కుంభరాశిలో వరుణ గ్రహ సంచారం వల్ల వృషభ రాశి వారికి అనుకూల ఫలితాలు లభిస్తాయి. కొత్త వ్యక్తులను కలుస్తారు, ఇది ఫ్యూచర్ లో మీకు లాభిస్తుంది. కళాత్మక రంగానికి సంబంధించిన వ్యక్తులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో ఈ వ్యక్తులు చాలా విజయాలు సాధిస్తారు.
కుంభం (Aquarius)- కుంభరాశిలో వరుణ గ్రహ సంచారం ఈ రాశివారికి లాభిస్తుంది. లక్ తో వీరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునేవారికి ఇదే మంచి సమయం.
కన్యారాశి (virgo)- కన్యా రాశి వారి ఆదాయం భారీగా పెరుగుతుంది. ఈ సమయంలో మీ ప్రతిభను కనబరచడానికి మీకు చాలా అవకాశాలు లభిస్తాయి. కళా రంగానికి సంబంధించిన వ్యక్తులు విశేష ప్రయోజనాలు పొందుతారు. సమాజంలో మీకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. కొత్త జాబ్ వస్తుంది.
కర్కాటకం (Cancer)- ఈ రాశి వ్యాపారులు భారీగా లాభాలను ఆర్జిస్తారు. ఈ సమయంలో మీరు కొత్త ఇల్లు కొనే అవకాశం ఉంది. లక్ కలిసి వస్తుంది.
మకరం (Capicron) - నెప్ట్యూన్ యొక్క సంచారం ఈ రాశి వారికి అనుకూలిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. ప్రయణాలు కలిసి వస్తాయి. సమాజంలో గౌరవం ఉంటుంది.
Also Read: Planet Transits 2022: సెప్టెంబరులో 3 గ్రహాల రాశి మార్పు.. ఈ రాశుల వారికి లక్కే లక్కు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook