Vat Purnima Vrat 2022: హిందూమతంలో వట్ పూర్ణిమ వ్రతం చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. జ్యేష్ఠ మాసం పౌర్ణమి రోజున పాటించే ఈ వ్రతంలో (Vat Purnima Vrat 2022) పెళ్లైన మహిళలు మర్రి చెట్టును పూజిస్తారు. ఈ రోజున మహిళలు తమ భర్త దీర్ఘాయువు కోసం ప్రార్థిస్తారు. దీనిని వట్ సావిత్రి వ్రతం అని కూడా అంటారు. ఈ వ్రతం జూన్ 14, 2022 అనగా మంగళవారం వచ్చింది. ఈ ఉపవాసాన్ని చేయడం వల్ల జీవితంలోని అన్ని సమస్యలు తొలగిపోయి.. అపారమైన ఆనందం మరియు శ్రేయస్సు పొందవచ్చు. ఈ రోజున చేసే కొన్ని పరిహారాలు ప్రభావవంతమైన ఫలితాలను ఇస్తాయి.
వట్ పూర్ణిమ 2022 పరిహారాలు:
>> వట్ పూర్ణిమ రోజున మర్రి చెట్టును పూజిస్తారు. మత గ్రంధాల ప్రకారం, ఈ చెట్టులో విష్ణువు, బ్రహ్మ మరియు శంకరుడు నివసిస్తారు. ఇది కాకుండా, మర్రి చెట్టును పూజించడం ద్వారా లక్ష్మీ దేవి కూడా సంతోషిస్తుంది.
>> మీరు పేదరికం, డబ్బుతో బాధపడుతున్నట్లయితే, ఈ రోజు మర్రి చెట్టుకు 7 సార్లు తెల్లటి దారాన్ని కట్టి, ఆపై నీరును పోయండి.
>> ఇంటి వాస్తు దోషాలు, గొడవలు పోవాలంటే వట్ పూర్ణిమ రోజు ఇంటిలోని పూజా మందిరంలో ఒక మర్రి చెట్టు కొమ్మను ఉంచండి. మీరు దానిని ఆఫీసులో లేదా దుకాణంలో కూడా ఉంచవచ్చు. ఇది జీవితంలోని అన్ని సమస్యలను తొలగిస్తుంది.
>> జీవితంలో వచ్చే అడ్డంకులను తొలగించడానికి, వట్ పూర్ణిమ కాకుండా ఆదివారం నాడు ఈ పరిహారం చేయండి. దీని కోసం, మర్రి చెట్టు ఆకుపై మీ కోరికను వ్రాసి నదిలో విసిరేయండి. ఇలా చేయడం వల్ల అడ్డంకులు తొలగిపోయి మీ కోరిక నెరవేరుతుంది.
>> జాతకంలో చంద్రదోషం ఉన్నవారు ఈరోజు రాత్రి చంద్రోదయం తర్వాత 07:29 గంటలకు చంద్రుడిని పూజించాలి. అందుకోసం నీళ్లలో పాలు, పంచదార, పూలు, అక్షతలను కలిపి చంద్రునికి సమర్పించాలి.
Also read: Jyeshtha Purnima 2022: జ్యేష్ఠ పూర్ణిమ రోజు ఈ చర్యలు తీసుకుంటే... మీరు కోటీశ్వరులు అవ్వడం పక్కా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook