Venus Transit 2024: ఈ రాశులవారి జీవితాల్లో ఊహించని మార్పులు..వీటిపై ఆసక్తి మరింత రెట్టింపు!

Venus Transit 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఫిబ్రవరి 12 శుక్ర గ్రహ సంచారం జరగబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 23, 2024, 02:11 PM IST
Venus Transit 2024: ఈ రాశులవారి జీవితాల్లో ఊహించని మార్పులు..వీటిపై ఆసక్తి మరింత రెట్టింపు!

 

Venus Transit 2024: శుక్రగ్రహానికి జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అంతేకాకుండా ఈ గ్రహ కదలికలకు, రాశి సంచారానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. శుక్రగ్రహం ఫిబ్రవరి 12న సోమవారం ఉదయం 05:00 గంటలకు శుక్రుడు మకరరాశిలోకి సంచారం చేయబోతోంది. ఆ తర్వాత మార్చిలో శుక్రుడు ఇతర రాశిలోకి సంచారం చేస్తాడు. అయితే కొన్ని రాశులవారికి ఫిబ్రవరి 12 నుంచి కొన్ని రాశుల వారికి స్వర్ణకాలం ప్రారంభం కాబోతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ గ్రహం సంచారం కారణంగా కొన్ని రాశులవారికి లక్ష్మిదేవి అనుగ్రహం కూడా లభించబోతోంది. అయితే ఏయే రాశులవారికి ఈ సమయం శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.   

ఈ రాశులవారికి లాభాలే లాభాలు:
మేష రాశి:

శుక్ర గ్రహ సంచారం కారణంగా మేషరాశి వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో  వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఊహించని లాభాలు పొందుతారు. దీంతో పాటు విహారయాత్రకు కూడా వెళ్లే ఛాన్స్‌ ఉంది. దీంతో పాటు ప్రేమ జీవితం గడుపుతున్నవారికి రొమాన్స్‌పై ఆసక్తి పెరుగుతుంది. దీంతో పాటు ఈ సమయంలో పూజలు చేయడం చాలా శుభప్రదమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 

కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి శుక్రుని సంచారం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో కష్టానికి తగిన ప్రతి ఫలం లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. కుటుంబంలో ఆనందం, శాంతి రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా ఆహ్లాదకరమైన జీవితాన్ని కూడా గడుపుతారు. దీంతో పాటు ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. కోరుకున్న కోరికలు నెరవేరి ఊహించని లాభాలు పొందుతారు. 

Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌

మకర రాశి:
శుక్రుని సంచారం మకరరాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు దూరమవుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ప్రేమ జీవితం గడుపుతున్నవారికి శృంగారం, ఆకర్షణపై మరింత ఆసక్తి పెరుగుతుంది. దీంతో పాటు ఈ సమయంలో చిన్న ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. వృత్తి పరంగా ఈ సమయం వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. 

Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News