Effects of Shukra Rashi Parivartan: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. శుక్రుడిని సంపద, సంతోషం, ఐశ్వర్యానికి కారకుడిగా పరిగణిస్తారు. ఫిబ్రవరి 27న శుక్రుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. మకర రాశిని శని దేవుడు పరిపాలిస్తాడు. శని, శుక్రుని మధ్య స్నేహ సంబంధం ఉంటుంది. కాబట్టి శుక్రుడు శని రాశిలోకి ప్రవేశించడం కొన్ని రాశుల వారి జీవితాల్లో సుఖ, సంతోషాలను నింపుతుంది. శుక్రుడు శని రాశిలోకి ప్రవేశించడం వల్ల ముఖ్యంగా 4 రాశుల వారిపై దాని ప్రభావం పడుతుంది.
మేషరాశి
మేష రాశి వారి జాతకంలో శుక్రుడు 10వ స్థానంలో సంచరిస్తాడు. పదో స్థానం వృత్తి, కీర్తి సంకేతం. ఉద్యోగస్తులు తమ వృత్తిలో పురోగతి సాధిస్తారు. అంతేకాదు, శుక్రుని సంచార సమయంలో మీకు కొత్త జాబ్ ఆఫర్ అందవచ్చు. ఇది కాకుండా ఆర్థికపరంగా కలిసొస్తుంది. వ్యాపార రంగంలో లాభాలు ఉంటాయి.
వృషభం
శుక్రుని సంచారంలో మార్పు ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. శుక్రుడు సంచరించే సమయంలో.. మీరు తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాన్ని పొందవచ్చు. శుక్ర సంచారం కారణంగా అదృష్టం మీ తలుపు తట్టే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉండొచ్చు. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. విద్యార్థులకు గుడ్ న్యూస్ అందుతుంది. వ్యాపార రంగంలోని వారికి అన్ని విధాలా కలిసొస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
ధనుస్సు
శుక్ర సంచార సమయంలో ఆరోగ్యం మెరుగుపడుతుంది. పెట్టుబడులకు ఇది అనువైన సమయం. ఇతరుల నుంచి మీకు రావాల్సిన డబ్బులు అందుతాయి.
ఇంట్లో సంపద పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
మీనరాశి
మీన రాశి వారి జాతకంలో శుక్రుడు 11వ ఇంట్లో సంచరిస్తాడు. వృత్తి రీత్యా పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఉద్యోగ రీత్యా ఆర్థికాభివృద్ధికి అవకాశం ఉంటుంది. పని ప్రదేశంలో మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. వ్యాపారాల్లో ఆర్థిక పురోగతి ఉంటుంది.
Also Read: New Movie Releases: భీమ్లానాయక్, వాలిమై.. ఈ వారం థియేటర్, ఓటీటీల్లో రిలీజ్ కానున్న చిత్రాలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook