New Movie Releases: భీమ్లానాయక్, వలిమై.. ఈ వారం థియేటర్, ఓటీటీల్లో రిలీజ్ కానున్న చిత్రాలు!

New Movie Releases: కరోనా కేసులు క్రమంగా తగ్గడం వల్ల పలు రాష్ట్రాల్లోని థియేటర్లు తెరుచుకుంటున్నాయి. దీంతో గత వారం నుంచి చిత్రాలు వరుసగా విడుదల కానున్నాయి. ఈ వారం టాలీవుడ్ లో భారీ బడ్జెట్ చిత్రం 'భీమ్లా నాయక్' రిలీజ్ కానుంది. అయితే ఈ వారం థియేటర్, ఓటీటీల్లో విడుదల కానున్న సినిమాలేవో తెలుసుకుందాం.   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 22, 2022, 09:30 AM IST
    • ఈ వారం థియేటర్లలో సందడి చేయనున్న పెద్ద సినిమాలు
    • భీమ్లా నాయక్, వలిమై చిత్రాలపై భారీ అంచనాలు
    • బాలీవుడ్ నుంచి ‘గంగూబాయి..’తో అలియా భట్ దండయాత్ర
New Movie Releases: భీమ్లానాయక్, వలిమై.. ఈ వారం థియేటర్, ఓటీటీల్లో రిలీజ్ కానున్న చిత్రాలు!

New Movie Releases: దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న క్రమంలో అనేక రాష్ట్రాలను ఆంక్షలను తొలగిస్తున్నాయి. ఈ క్రమంలో సినిమా థియేటర్లు కూడా పూర్తిగా తెరుచుకుంటున్నాయి. టాలీవుడ్ లో గత వారం నుంచి సినిమాల రిలీజ్ లు జోరందుకున్నాయి. ఈ వారం కూడా అనేక సినిమాలు అటు థియేటర్ తో పాటు ఇటు ఓటీటీల్లోనూ విడుదలకు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా 'భీమ్లా నాయక్' ఈ శుక్రవారం (ఫిబ్రవరి 25) విడుదల కానుంది. అయితే ఈసారి బాక్సాఫీసుపై పవర్ స్టార్ దండయాత్ర ఖాయమని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. \

అంత భారీ బడ్జెట్ చిత్రం రిలీజ్ కానున్న నేపథ్యంలో చిన్న సినిమాలు విడుదలను వాయిదా వేసుకున్నాయి. అయితే ఈ వారం థియేటర్, ఓటీటీల్లో విడుదలయ్యే చిత్రాలేమిటో తెలుసుకుందాం. 

'భీమ్లా నాయక్' మాస్ జాతర

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన మల్టీస్టారర్ చిత్రం 'భీమ్లా నాయక్'. ఈ సినిమా ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా ఉన్న థియేటర్లలో సినిమా విడుదల కానుంది. మలయాళ సూపర్ హిట్ చిత్రం 'అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌' సినిమాకు రీమేక్ గా రూపొందిన చిత్రానికి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించారు. 

'వలిమై' రాక..

తమిళ అగ్రకథానాయకుడు అజిత్ హీరోగా కార్తికేయ విలన్ గా నటించిన చిత్రం 'వలిమై'. తమిళంతో పాటు తెలుగులోనూ ఫిబ్రవరి 24న ఈ సినిమా రిలీజ్ కానుంది. హెచ్‌.వినోద్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. 

'గంగూబాయ్..' దందూ షురూ  

సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో అలియా భట్ ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం 'గంగూబాయ్ కతియవాడి'. గంగా హరిజీవన్ దాస్ అనే మహిళ జీవితాధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 25న థియేటర్లలో విడుదల చేయనున్నారు. హిందీతో పాటు, తెలుగులోనూ ఈ సినిమా విడుదలవుతోంది. 

ఓటీటీల్లో సినిమాలు..

'సెహరి' సంబరం

యువ కథానాయకుడు హర్ష్‌ కనుమిల్లి, సిమ్రాన్‌ చౌదరి కలిసి నటించిన చిత్రం 'సెహరి'. జ్ఞానసాగర్ ద్వారా ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. అద్వయ జిష్ణు రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు. ఫిబ్రవరి 11న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడీ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 25న తెలుగు ఓటీటీ 'ఆహా'లో విడుదల కానుంది. 

ఓటీటీల్లో విడుదల కానున్న పరభాష చిత్రాలు

  1. ది ప్రొటేష్ (ఇంగ్లీష్) - అమెజాన్ ప్రైమ్ వీడియో - ఫిబ్రవరి 25 
  2. లవ్‌ హాస్టల్‌ (హిందీ) - జీ 5 - ఫిబ్రవరి 25
  3. ది ఫేమ్ గేమ్ (హిందీ) - నెట్ ఫ్లిక్స్  - ఫిబ్రవరి 25
  4. వైకింగ్స్ : వాల్హా (సిరీస్) - నెట్ ఫ్లిక్స్ - ఫిబ్రవరి 25
  5. జువైనల్‌ జస్టిస్‌ (సిరీస్‌) - నెట్ ఫ్లిక్స్ - ఫిబ్రవరి 25
  6. ఎ మాడియా హోమ్‌ కమింగ్‌ (ఇంగ్లీష్) - నెట్ ఫ్లిక్స్ -  ఫిబ్రవరి 25
  7. స్టార్‌ వార్స్‌ ఒబీ -వాన్‌ కెనోబి (వెబ్‌ సిరీస్‌) - డిస్నీ + హాట్ స్టార్ -  ఫిబ్రవరి 25

Also Read: Bheemla Nayak: నాన్ థియేట్రికల్ రైట్స్‌లో భీమ్లా నాయక్ మూవీకి భారీ వసూళ్లు!

Also Read: Bheemla Nayak OTT: 'భీమ్లా నాయక్' ఓటిటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News