January Weekly Horoscope 2024: 2024 జనవరి 1 నుంచి కొత్త వారం ప్రారంభం కాబోతోంది. ఈ రాబోయే కొత్త సంవత్సరంలో అనేక గ్రహాలు సంయోగం చేయబోతున్నాయి. దీంతోపాటు కొన్ని గ్రహాలు తిరోగమనం కూడా చేయబోతున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు తిరోగమనం, సంయోగం, సంచారం చేసినప్పుడు మొత్తం 12 రాశుల వారిపై శుభ, అశుభ ప్రభావాలు పడతాయి. కాబట్టి 2024 సంవత్సరం జనవరి మొదటి వారంలో కొన్ని రాశుల వారిపై ప్రత్యేక ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో ఏయే రాశుల వారిపై ప్రత్యేక ప్రభావం పడబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మేషరాశి:
జనవరి మొదటి వారం మేష రాశి వారికి చాలా బాగుంటుంది. వీరికి ఈ సమయంలో ఒత్తిడి తగ్గి సంతోషంగా ఉండగలుగుతారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారు ఆఫీసుల్లో అందరితో స్నేహపూర్వక సంబంధాలు కలిగి ఉంటారు. దీంతో పాటు వ్యాపారాలు ఇంతకుముందు ఎప్పుడు పొందలేని లాభాలు కూడా ఈ వారం పొందగలుగుతారు. పనిపై దృష్టి పెట్టడం వల్ల ఎలాంటి విజయాలైన సులభంగా సాధిస్తారు. దీంతోపాటు ప్రియమైన వారితో సమయం గడుపుతారు.
వృషభ రాశి:
వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ప్రయోజనాలు కలుగుతాయి కొన్ని పనుల్లో నిరాశలు ఎదురవచ్చు.. దీంతోపాటు ఆదాయంలో మార్పులు వచ్చి ఖర్చులు కూడా విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొత్త కారు లేదా స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నావారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. దీంతోపాటు వీరు ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.
సింహరాశి:
సింహరాశి వారికి ఈ వారం చాలా లాభదాయకంగా ఉండబోతోంది. ఈ సమయంలో కష్టపడి పనిచేయడం వల్ల ఎలాంటి విజయాలైన సులభంగా సాధిస్తారు. అంతేకాకుండా కొంత ఒత్తిడి తగ్గి పనులలో కూడా మార్పులు వస్తాయి. అయితే ఈ సమయంలో అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకునే క్రమంలో తప్పకుండా శరీరంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. లేదంటే అనేక రకాల వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
కన్యా రాశి:
కన్యా రాశి వారికి జనవరి మొదటి వారం ఎంతో అనుకూలంగా ఉంటుంది కుటుంబ జీవితంలో సంతోషకరమైన రోజులను పొందుతారు. అంతేకాకుండా ఈ సమయంలో అతిగా ఆలోచించడం మానుకోవాలి. గతంలో జరిగిన సంఘటనలను వదిలేయడానికి ప్రయత్నించడం చాలా మంచిది. ఇక ప్రేమ జీవితం గడుపుతున్న వారికి కొన్ని హెచ్చుతగ్గులు రావచ్చు.. కాబట్టి ఎంతో ఓపికగా ఉండాలి. తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలు పొందడానికి ప్రయత్నిస్తున్న వారు ఈ సమయంలో తప్పకుండా జాగ్రత్తలు పాటించాలి. ఒత్తిడి తగ్గించుకోవడానికి తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
తులా రాశి:
జనవరిలోని మొదటివారం తులా రాశి వారికి ఎంతో సానుకూలంగా ఉంటుంది ఈ సమయంలో పని పై ప్రత్యేక శ్రద్ధ వహించి కష్టపడడం వల్ల అనేక విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా ఆర్థిక స్తోమత కూడా పెరుగుతుంది. అప్పులు తీర్చడానికి కొత్త ఆదాయ వనరులు వస్తాయి. అంతేకాకుండా వ్యాపారాలు చేస్తున్న వారు ఈ సమయంలో కొత్తగా పెట్టుబడులు కూడా పెట్టొచ్చు. అయితే ఈ వారం ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. లేకపోతే మళ్లీ అనారోగ్య సమస్యల బారిన పడతారు.
వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారికి ఈ మొదటి వారం మిశ్రమంగా ఉంటుంది. కొత్త కొత్త కోరికల నుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాకుండా మీకు ప్రియమైన వారితో మంచి సంబంధాలు పొందుతారు. దీంతోపాటు కొన్ని ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఈ సమయంలో తప్పకుండా కొన్ని అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
ధనస్సు రాశి:
ధనస్సు రాశి వారు జనవరి మొదటి వీక్ విశ్రాంతి తీసుకోవడం చాలా మంచిది. ఆర్థికపరంగా ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసి వస్తుంది. అంతే కాకుండా చిన్న చిన్న సవాళ్లు కూడా ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ఈ వారం సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. దీంతోపాటు వీరు ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.
మకర రాశి:
మకర రాశి వారికి ఈ సమయం లాభాలతో పాటు నష్టాలు కూడా కలుగుతాయి. ఈ సమయంలో అనేక రకాల ఆదాయ వనరులు పొందుతారు. ముఖ్యంగా వ్యాపారాలు చేసే వారికి ఆశించిన లాభాలు కలుగుతాయి. సంబంధాల్లో హెచ్చుతగ్గులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఈ సమయంలో తప్పకుండా విశ్రాంతి తీసుకోవడం చాలా మంచిది.
Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter
Weekly Horoscope Telugu: జనవరి మొదటి వారం రాశి ఫలాలు..ఈ రాశుల వారికి లాభనష్టాలు తప్పవు..