Weekly Rasi Phalalu: సెప్టెంబర్ రెండో వారంలో బుధాదిత్య రాజయోగం.. ఈ రోజు నుంచే వీరికి అదృష్టం, డబ్బు సొంతం..

Weekly Rasi Phalalu: సెప్టెంబర్ రెండో వారంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా వీరికి ఊహించని ధన లాభాలలో పాటు అఖండ విజయాలు సాధించగలిగే శక్తిని పొందుతారు. అలాగే ఆర్థికపరంగా కూడా మంచి లాభాలు పొందుతారు.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Sep 9, 2024, 10:38 AM IST
Weekly Rasi Phalalu: సెప్టెంబర్ రెండో వారంలో బుధాదిత్య రాజయోగం.. ఈ రోజు నుంచే వీరికి అదృష్టం, డబ్బు సొంతం..

 

Weekly Rasi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సెప్టెంబర్ రెండోవారం ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఎందుకంటే ఈ వారంలోనే ఎంతో శక్తివంతమైన కొన్ని యోగాలు ఏర్పడబోతున్నాయి. అందులో ప్రధానమైన బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా ఈ వారం ప్రాముఖ్యత మరింత పెరిగిందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే బుధాదిత్య రాజయోగం సోమవారం (సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ) రోజున ఏర్పడింది. సింహరాశిలోకి సూర్యుడు బుధుడు సంచారం చేయడం కారణంగా ఈ యోగం ఏర్పడింది. అయితే ఈ ప్రత్యేకమైన యోగం కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సెప్టెంబర్ రెండో వారంలో సమస్యల్లో ఉన్న వ్యక్తులు కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయి. అయితే సెప్టెంబర్ రెండో వారంలో అత్యధిక లాభాలు పొందబోయే రాశుల వారెవరో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

మేష రాశి: 
సెప్టెంబర్ రెండోవారం మేష రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది.. ఎందుకంటే ఈ బుధాదిత్య రాజయోగం ఏర్పడిన కారణంగా వీరికి అదృష్టం మరింత పెరుగుతుంది. అలాగే డబ్బు సంబంధిత సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా వ్యాపారాల్లో లాభాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా వీరు ఈ సమయంలో శత్రువుల పట్ల కొంత జాగ్రత్తగా ఉండడమే ఎంతో మేలు. అలాగే ప్రేమ జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. 

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

మిధున రాశి: 
బుధాదిత్య రాజయోగం కారణంగా మిధున రాశి వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది.. ముఖ్యంగా కెరీర్ కు సంబంధించిన జీవితాల్లో సమస్యలు తొలగిపోవడమే కాకుండా అనుకున్న పనుల్లో విజయాల సాధించడానికి మంచి అదృష్టాన్ని పొందుతారు. అంతేకాకుండా ఈ సమయంలో కొత్త ఆదాయపనరులు కూడా లభిస్తాయి. దీని కారణంగా ఎలాంటి పనులు ప్రారంభించిన మంచి విజయాలు విజయాల సాధిస్తారు. అలాగే ఈ వారం ఆగిపోయిన డబ్బులు కూడా తిరిగి వస్తాయి.. అంతేకాకుండా ఆనందం కూడా విపరీతంగా పెరుగుతుంది. 

కర్కాటక రాశి: 
కర్కాటక రాశి వారికి కూడా సెప్టెంబర్ రెండోవారం ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి దీర్ఘకాలిక వ్యాధులనుంచి విముక్తి కలగడమే కాకుండా ఖర్చులు కూడా విపరీతంగా తగ్గుతాయి. దీని కారణంగా సంపాదనలో అనేక మార్పులు వస్తాయి. అలాగే ఎలాంటి పనులు చేసిన అద్భుతమైన విజయాలను పొందుతారు. దీంతో పాటు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది.

తులారాశి: 
తులా రాశి వారికి కూడా సెప్టెంబర్ రెండోవారం ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి జీవితంలో సమస్యలన్నీ తొలగిపోతాయి.. దీంతో వీరు ఎంతో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుదాం. అంతేకాకుండా కొత్త ఆస్తులను కూడా కొనుగోలు ఇచ్చేస్తారు. అలాగే అత్తమామల నుంచి కూడా ఆదాయ వనరులు లభించి... విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. ఇక ఉద్యోగాలు చేసేవారు ఆఫీసుల పనిమీద ప్రయాణాలు కూడా చేయవచ్చు. దీని కారణంగా కొన్ని లాభాలు కూడా కలుగుతాయి.

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News