భారత్ రెండో సారి వన్డే ప్రపంచ కప్ (2011 ODI World Cup) సాధించి నేటికి సరిగ్గా 9 ఏళ్లు. అయితే గత తొమ్మిదేళ్ల నుంచి ఏప్రిల్ 2వ తేదీ వచ్చిందంటే భారత క్రికెట్ అభిమానుల గుండె గర్వంతో ఉప్పొంగుతుంది. కానీ, ఈరోజు ఎంఎస్ ధోనీ ఫ్యాన్స్ వర్సెస్ గౌతమ్ గంభీర్ అభిమానులు అనేలా పరిస్థితి మారుతోంది. అందుకు కారణం ధోనీ సిక్స్‌తో భారత్ ప్రపంచ కప్ గెలిచిందని ప్రస్తావించడం వివాదాలకు ఆజ్యం పోస్తుంది. సెక్సీ ఫిగర్‌తో సెగలు రేపుతోన్న భామ
తాజాగా అదే జరిగింది. ఈఎస్‌పీఎన్ క్రిక్ఇన్ఫో తన ట్విట్టర్‌లో.. 2011లో ఇదే రోజు ఆ ఒక్క షాట్ భారత అభిమానులకు సంతోషాన్ని తెచ్చిపెట్టిందని ధోనీ విన్నింగ్ షాట్ కొట్టిన ఫొటోను పోస్ట్ చేసింది. దీనిపై గతంలో మాదిరిగానే మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ స్పందించారు. 2011 వన్డే ప్రపంచ కప్ భారత్, భారత క్రికెట్ జట్టు, సహాయక సిబ్బంది కలిసి గెలించిందని గుర్తుంచుకోవాలని గంభీర్ దీటుగానే స్పందించారు. అయితే ఎప్పుడు చూసినా ఆ సిక్స్ గురించే ప్రస్తావిస్తున్నారని గంభీర్ ట్వీట్ చేశారు. కడుపుబ్బా నవ్వించే Corona జోక్స్
Just a reminder @ESPNcricinfo: #worldcup2011 was won by entire India, entire Indian team & all support staff. High time you hit your obsession for a SIX. pic.twitter.com/WPRPQdfJrV
— Gautam Gambhir (@GautamGambhir) April 2, 2020
వాస్తవానికి ఫైనల్లో గంభీర్ లేకపోయింటే భారత్ కప్ గెలవడం కలగానే మిగిలిపోయేదని క్రీడా పండితులు ఒప్పుకుంటారు. సచిన్, సెహ్వాగ్ లాంటి దిగ్గజాలు ఔటైన సమయంలో జట్టు కోసం శ్రమించి, ఒత్తిడిలోనూ బ్యాటింగ్ చేసి భారత ఆశల్ని సజీవంగా నిలిపింది గంభీర్ అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. మూడో వికెట్‌కు కోహ్లీతో కలసి 83 పరుగుల భాగస్వామ్యం, నాలుగో వికెట్‌కు ధోనీతో కలిసి శతక భాగస్వామ్యం (109 పరుగులు) అందించిన తర్వాత పెరీరా బౌలింగ్‌లో గంభీర్ బౌల్డయ్యాడు. అయితే అప్పటికే భారత్ పటిష్ట స్థితిలో ఉంది. గంభీర్, యువీ పోరాటం.. ధోనీ ఫినిషింగ్.. అద్భుతమైన క్షణాలు
అప్పటికీ భారత్ లక్ష్యం 52 బంతుల్లో 52 మాత్రమే. యువరాజ్ సింగ్, సురేష్ రైనాలు బ్యాటింగ్‌కు దిగాల్సి ఉండగా.. ధోనీ క్రీజులో ఉన్నాడు. బంతికి పరుగు చేయడం పటిష్ట జట్టుకు పెద్ద కష్టమేమీ కాదు. అయితే గంభీర్ ట్వీట్ ధోనీ అభిమానులకు కోపాన్ని తెప్పించింది. గంభీర్ ఫినిషడ్ టు బౌల్డ్ ఇన్ పెరీరా బౌలింగ్ అని సెటైర్లు వేస్తున్నారు. అయితే 2007 ట్వంటీ 20 వరల్డ్ కప్, 2011 వన్డే ప్రపంచ కప్‌లలో గంభీరే హీరో అని కామెంట్ చేసి మాజీ ఓపెనర్‌కు మద్దతు తెలుపుతున్నారు. వాస్తవానికి టాపార్డర్ ఆటగాళ్లు చివరివరకూ క్రీజులో నిలిచి జట్టుకు విజయం అందించిన సందర్భాలు వేళ్ల మీద లెక్కపెట్టవచ్చునని తెలిసిందే. మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. వెండి పరుగులు జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ