అంతర్జాతీయ క్రికెట్‌కు స్టార్ క్రికెటర్ గుడ్ బై

అలిస్టర్ కుక్ కెరీర్

Last Updated : Sep 3, 2018, 06:39 PM IST
అంతర్జాతీయ క్రికెట్‌కు స్టార్ క్రికెటర్ గుడ్ బై

క్రికెట్‌కు ఇంగ్లండ్ ఆటగాడు అలిస్టర్ కుక్ వీడ్కోలు పలకనున్నారు. ఈనెల 7న భారత్‌తో జరుగనున్న ఐదో టెస్ట్ మ్యాచ్ అనంతరం కుక్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పనున్నారు. ఎడమచేతి వాటం కలిగిన కుక్ అత్యధికంగా 161 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. 12, 254 పరుగులు చేశాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న పదివేల మైలు రాయి రికార్డును 33 ఏళ్ల అలిస్టర్ కుక్ బద్దలు కొట్టాడు. అత్యంత చిన్న వయసులో టెస్టుల్లో 10 వేల పరుగుల మైలురాయిని దాటిన ఆటగాడిగా అలిస్టర్‌ కుక్‌ రికార్డు సృష్టించాడు. అతను 31 ఏళ్ల 157 రోజుల్లోనే ఈ ఘనత సాధించాడు. టెస్టుల్లో పదివేల పరుగులు చేసిన బ్యాట్స్ మెన్లలో కుక్ 12వ ఆటగాడిగా చరిత్ర పుటల్లోకి ఎక్కాడు.

మార్చి 1, 2006లో నాగపూర్‌లో జరిగిన టెస్టుతో అరంగేట్రం చేసిన కుక్.. ఇంగ్లండ్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా (12, 254*), టెస్టులో అత్యధిక శతకాలు బాదిన క్రికెటర్‌గా (32*), టెస్టుల్లో అత్యధిక అర్థ సెంచరీ చేసిన క్రికెటర్‌గా (56*) చరిత్ర సృష్టించాడు.

అలిస్టర్ కుక్ కెరీర్

  • ఆడిన టెస్టులు: 160
  • ఇన్నింగ్స్: 289
  • పరుగులు: 12, 254
  • సగటు: 44.88
  • హై స్కోర్: 294 (భారత్‌పై 2011లో)
  • అర్థ సెంచరీలు: 56
  • సెంచరీలు: 32
  • క్యాచ్లు: 173
  • అరంగేట్రం: మార్చి 2006 (vs ఇండియా)
  • ఇటీవలి స్కోర్లు: 12, 17, 17, 29, 21, 0, 13

Trending News