విరాట్ కోహ్లీకి అనుష్క ఫ్లైయింగ్ కిస్

సినీనటి, భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ ఐపీఎల్‌లో తనదైన శైలిలో భర్తపై ప్రేమను కురిపించింది. 

Last Updated : Apr 14, 2018, 03:03 PM IST
విరాట్ కోహ్లీకి అనుష్క ఫ్లైయింగ్ కిస్

సినీనటి, భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ ఐపీఎల్‌లో తనదైన శైలిలో భర్తపై ప్రేమను కురిపించింది. శుక్రవారం రాయల్‌ ఛాలెంజర్స్‌, బెంగళూరు - కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా.. సినీతారలు అనుష్క శర్మ, ప్రీతి జింతా గ్యాలరీలో ఆటగాళ్లను హుషారు పరుస్తూ కనిపించారు. ఆసక్తికరంగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఆటగాడు డివిలియర్స్‌ పరుగుల వరదను పారించడంతో ఆ జట్టు విజయతీరాలను చేరింది. ఇదే క్రమంలో అనుష్క, తన భర్త విరాట్ కోహ్లీకి ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది. ఆ తర్వాత.. కోహ్లీయే స్వయంగా అనుష్కకు ఫోన్ చేసి రమ్మని అడిగిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముఖ్యంగా కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కోహ్లీ క్యాచ్ పట్టాక.. గ్యాలరీలో ఉన్న  అనుష్క శర్మ వైపు చూసి నవ్వడంతో అభిమానులు కేరింతలతో అలరించారు. 

Trending News