Lionel Messi Income: లియోనెల్ మెస్సీ ఏడాది సంపాదన వింటే..నోరెళ్లబెట్టాల్సిందే

Lionel Messi Income: లియోనెల్ మెస్సీ. ప్రపంచ దిగ్గజ ఫుట్‌బాల్ ఆటగాడు. ఫిఫా ప్రపంచకప్ సందర్భంగా మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇంతకీ ఈ మెస్సీ సంపాదన ఎంతో తెలిస్తే..నోరెళ్లబెట్టాల్సిందే.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 18, 2022, 10:01 PM IST
Lionel Messi Income: లియోనెల్ మెస్సీ ఏడాది సంపాదన వింటే..నోరెళ్లబెట్టాల్సిందే

అర్జెంటీనా ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ ఆట సామర్ధ్యమేంటో అందరికీ తెలుసు. ఇప్పుడు సంపాదనపరంగా అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఆషామాషీ సంపాదన కాదు. ఏడాది సంపాదన చాలా దేశాల బడ్జెట్ దాటి ఉందంటే నమ్మలేకున్నారా..

ప్రపంచ ప్రసిద్ధి పుట్‌బాలర్లలో ఒకడు లియోనెల్ మెస్సీ. ప్రపంచవ్యాప్తంగా పెద్దసంఖ్యలో అభిమానుల్ని కలిగిన ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సీ. అర్జెంటీనా జట్టు ఫుట్‌బాల్ ప్లేయర్ మెస్సీ సంపాదన ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. 

మెస్సీ ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత ధనిక క్రీడాకారుల్లో ఒకడిగా ఉన్నాడు. గతంలో బార్సిలోనాకు ప్రాతినిధ్యం వహించేవాడు. 2021 ఆగస్టులో ప్యారిస్ సెయింట్ జర్మన్ క్లబ్‌లో చేరడంతో భారీగా డబ్బులు దక్కాయి. నెట్‌వర్త్ సంపాదన ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇతడికి చాలా దేశాల్లో విలాసవంతమైన ఇళ్లు ఉన్నాయి.

మెర్సీ సంపాదన కేవలం ఫుట్‌బాల్ మ్యాచెస్ ద్వారానే కాకుండా..చాలా దేశాల్లో సంపాదన లభిస్తోంది. ఇందులో పెద్ద పెద్ద బ్రాండ్లకు ప్రాతినిధ్యం వహిస్తూ అద్భుతంగా సంపాదిస్తున్నాడు. మెస్సీ స్టోర్ పేరుతో వస్త్ర వ్యాపారం కూడా ఉంది. 

అర్జెంటీనాలో పుట్టిన ఈ దిగ్హజ ఆటగాడి ఆట బార్సిలోనాతో ముగిసిన తురవాత..మెర్సీ స్పాన్సర్‌షిప్ ద్వారా అతని సంపాదన దాదాపు 1.3 బిలియన్ డాలర్లుగా ఉంది. 900 మిలియన్ డాలర్ల జీతం కాకుండా ఇతర మార్గాల్లో 400 మిలియన్ డాలర్లు సంపాదిస్తున్నాడు. వట్‌వర్త్ సంపాదనపరంగా లెక్కేస్తే అది 620 మిలియన్ డాలర్లుగా ఉంది. 

లియోనెల్ మెస్సీ నెట్‌వర్త్ సంపాదన చాలా దేశాల ఏడాది బడ్జెట్‌కు సమానంగా ఉందంటే నమ్మలేరు. ఫోర్బ్స్ జాబితా ప్రకారం అందరికంటే ఎక్కువ సంపాదించే క్రీడాకారుల జాబితా 2022 లో మెర్సీ అగ్రస్థానంలో నిలిచాడు. 2022లో 130 మిలియన్ డాలర్లు సంపాదించాడు. ఇతడి ఏడాది నెట్‌వర్త్ సంపాదన..కోమోరోస్, గాంబియా, సేషెల్స్, చాడ్ దేశాల ఏడాది బడ్జెట్ కంటే ఎక్కువే. సోమాలియా, బెర్ముడా దేశాల ఏడాది బడ్జెట్‌తో సమానంగా ఉంది. 

Also read: World Cup 2023: ఆ వివాదం పరిష్కరించకపోతే, 2023 వన్డే ప్రపంచకప్ మరో దేశానికి వెళ్లిపోనుందా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News