Australia Squad For ODI World Cup 2023: భారత్ వేదికగా అక్టోబర్ 5వ తేదీ నుంచి ప్రారంభంకానున్న వన్డే వరల్డ్ కప్‌కు అన్ని జట్లు ఇంకా ఆటగాళ్లను సిద్ధం చేసుకునే పనిలోనే ఉండగా.. ఆస్ట్రేలియా ముందుగా సవాల్ విసిరింది. అందరి కంటే ప్రపంచ కప్‌కు జట్టును ప్రకటించి.. పోటీకి తాము సై అంటూ రెడీ అవుతోంది. 18 మంది సభ్యులతో కూడిన జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. పాట్ కమ్మిన్స్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. అయితే వైస్ కెప్టెన్‌గా ఎవరినీ ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యం కలిగించింది.
భారత సంతతికి చెందిన లెగ్ స్పిన్నర్ తన్వీర్ సంఘా, వెస్ట్రన్ ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ ఆరోన్ హార్డీలు జట్టులో చోటు దక్కించుకోగా.. స్టార్ బ్యాట్స్‌మెన్ లబూషేన్‌కు మాత్రం సెలక్టర్ల నుంచి నిరాశ ఎదురైంది. ప్రస్తుతం 18 మంది సభ్యులను ప్రకటించగా.. తరువాత 15 మంది సభ్యులకు కుదించనున్నారు.
ప్రస్తుతం ప్రకటించిన టీమ్‌తోనే దక్షిణాఫ్రికా, భారత్‌లతో వన్డే సిరీస్‌లు ఆడనుంది. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు కూడా జట్టును ప్రకటించారు. ఈ టీమ్‌కు మిచెల్ మార్ష్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. బిగ్‌బాష్ లీగ్‌లో రాణించిన ఆటగాళ్లు టీ20 జట్టులో స్థానం దక్కించుకున్నారు. సెప్టెంబర్ 7వ నుంచి కంగారూ జట్టు దక్షిణాఫ్రికా పర్యటనను మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో ప్రారంభించాల్సి ఉంది. సఫారీ టీమ్‌తో వన్డే సిరీస్‌కు గ్లెన్ మాక్స్‌వెల్ దూరమయ్యాడు. తన మొదటి బిడ్డ రాక కోసం స్వదేశానికి వెళ్లిపోనున్నాడు. అనంతరం టీమిండియాతో సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌కు జట్టుతో చేరనున్నాడు. వరల్డ్ కప్‌కు ముందు భారత్‌తో ఆసీస్ జట్టు మూడు వన్డేల సిరీస్ ఆడనుంది.
Presenting your 18-player squad for the 2023 ODI World Cup, as well as two lead-in series against South Africa and India! 🏆🇦🇺 pic.twitter.com/h6jVWYJvMy
— Cricket Australia (@CricketAus) August 7, 2023
ఆస్ట్రేలియా వన్డే జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, సీన్ అబాట్, అష్టన్ అగర్, అలెక్స్ కారీ, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, జోష్ హాజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, తన్వీర్ సంఘా, మార్కస్ స్టాయినిస్, ఆడమ్ జంపా, ట్రావిస్ హెడ్.
దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు టీమ్: మాట్ షార్ట్, టిమ్ డేవిడ్స్, జేసన్ బెహ్రెన్‌డార్ఫ్, జోష్ ఇంగ్లీష్, మార్కస్ స్టాయినిస్, నాథన్ ఎల్లిస్, స్టీవ్ స్మిత్, మిచెల్ మార్ష్ (కెప్టెన్), జాన్సన్, ట్రావిస్ హెడ్, ఆరోన్ హార్డీ, ఆడమ్ జంపా, గ్లెన్ మాక్స్‌వెల్, సీన్ అబాట్.
Also Read: Gaddar: మూగబోయిన ఉద్యమ గళం.. నేడు అధికారిక లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు..
Also Read: TSPSC : ముందుగా ప్రకటించిన తేదీల్లోనే గ్రూప్-2 పరీక్ష.. క్లారిటీ ఇచ్చిన సీఎం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook