Novak Djokovic: టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ (Australian Open 2021) నుంచి నిష్క్రమించాడు. ఆస్ట్రేలియా ప్రభుత్వం రెండో సారి అతడి వీసాను రద్దు (Visa Cancelled) చేసిన నేపథ్యంలో కోర్టును ఆశ్రయించిన జకోవిచ్‌కు చుక్కెదురైంది. టెన్నిస్ స్టార్ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు ఆస్ట్రేలియా ఫెడరల్ కోర్టు (Federal Court) ఛీఫ్ జస్టిస్ జేమ్స్ అల్సోప్ తెలిపారు. జకోవిచ్ తమ దేశాన్ని వదిలివెళ్లాలని తీర్పులో పేర్కొన్నారు. కోర్టు వాదనల కోసం అయిన ఖర్చు కూడా అతడు ప్రభుత్వానికి చెల్లించాలని ఆదేశించారు.
తాజా ఘటనపై నొవాక్ జకోవిచ్ (Novak Djokovic) మాట్లాడుతూ.."తీవ్ర నిరాశ చెందా..అయినా కోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తా. ఆస్ట్రేలియా నుంచి తిరిగి వెళ్లడానికి అధికారులు చేస్తున్న ఏర్పాట్లకు సహకరిస్తాను." అని అన్నాడు. అయితే రెండోసారి వీసా రద్దయిన కారణంగా మూడేళ్ల పాటు అతడు ఆస్ట్రేలియాలో అడుగుపెట్టడానికి లేదు. 2025 వరకు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అతడు ప్రాతినిధ్యం వహించలేడు.
Also Read: PV Sindhu - India Open: పీవీ సింధు విజయ పరంపర.. ఇండియా ఓపెన్ సెమీ ఫైనల్స్‌కు తెలుగు తేజం!!
సెర్బియా స్టార్ జకోవిచ్ మెుదటగా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో (Australian Open) పాల్గొనేందుకు మెల్‌బోర్న్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాడు. వాక్సినేషన్‌కు సంబంధించిన ధ్రువపత్రాలు లేని కారణంగా ఆస్ట్రేలియా బోర్డర్ ఫోర్స్ అధికారులు అతడి వీసాను రద్దు చేసి...డిటెన్షన్ సెంటర్‌లో ఉంచారు. ఈ క్రమంలో జకోవిచ్ కోర్టును ఆశ్రయించాడు జకోవిచ్. అతడిని డిటెన్షన్ నుంచి వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది ఫెడరల్ కోర్టు. కొద్ది రోజుల తర్వాత మరోసారి జకోవిచ్ వీసాను రద్దు చేశారు ఆస్ట్రేలియా ఇమ్మిగ్రేషన్ మినిస్టర్ అలెక్స్ హాకే. అనంతరం అతడిని మరోసారి డిటెన్షన్ సెంటర్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో మరోసారి కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో తాజా తీర్పు వెలువడింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook