Azharuddin car accident: అజారుద్దీన్ కారుకు ప్రమాదం

Azharuddin's car met with an accident | జైపూర్: టీమిండియా మాజీ కెప్టెన్‌, హైదరాబాద్ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మహమ్మద్‌ అజారుద్దీన్‌ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. అజార్ తన కుటుంబంతో ( Mohammad Azharuddin's family ) కలిసి ర‌ణ్‌తంబోర్‌కు వెళ్తుండగా లల్సోట్ - కోటా హైవేపై ఈ ప్రమాదం జరిగింది.

Last Updated : Dec 30, 2020, 10:23 PM IST
  • రోడ్డు ప్రమాదానికి గురైన టీమిండియా మాజీ కెప్టెన్‌, హైదరాబాద్ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మహమ్మద్‌ అజారుద్దీన్.
  • రాజస్థాన్‌లోని సూర్వాల్ వద్ద ప్రమాదానికి గురైన అజార్ కారు.
  • టైరు పేల‌డం వ‌ల్ల ధాబాలోకి దూసుకుపోయిన అజార్ ప్ర‌యాణిస్తున్న కారు.
Azharuddin car accident: అజారుద్దీన్ కారుకు ప్రమాదం

Azharuddin's car met with an accident | జైపూర్: టీమిండియా మాజీ కెప్టెన్‌, హైదరాబాద్ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మహమ్మద్‌ అజారుద్దీన్‌ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. అజారుద్దీన్ అసిస్టెంట్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. రాజస్థాన్‌లోని సూర్వాల్ సమీపంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో అజారుద్దిన్ ప్రయాణిస్తున్న కారు ( Mohammad Azharuddin's car ) ముందు భాగం పూర్తిగా ధ్వంసం కాగా అదృష్టవశాత్తుగా ఆయన ఎటువంటి గాయాలు కాకుండా ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో అజారుద్దీన్ కుటుంబసభ్యులు కూడా అదే కారులో ఉన్నారని తెలుస్తోంది. కారులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తికి స్వల్ప గాయాలైనట్టు ఏబీపీ న్యూస్ పేర్కొంది.

అజార్ తన కుటుంబంతో ( Mohammad Azharuddin's family ) కలిసి ర‌ణ్‌తంబోర్‌కు వెళ్తుండగా లల్సోట్ - కోటా హైవేపై ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం అనంతరం అజారుద్దీన్ కుటుంబం మరో వాహనంలో హోటల్‌కి వెళ్లిపోయారు. టైరు పేల‌డం వ‌ల్ల అజారుద్దీన్ ప్ర‌యాణిస్తున్న కారు అదుపు తప్పి నేరుగా రోడ్డు ప‌క్క‌నే ఉన్న ధాబాలోకి దూసుకుపోయింది. కేసు నమోదు చేసుకున్న సూర్వాల్ పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

Also read: SSC Exams 2021 updates: 10వ తరగతి బోర్డు పరీక్షల షెడ్యూల్‌ అప్‌డేట్స్

అజారుద్దీన్ కుటుంబాన్ని వెంటాడుతున్న రోడ్డు ప్రమాదాలు..
మహమ్మద్ అజారుద్దీన్ ( Mohammad Azharuddin ) రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారన్న వార్త ఆయన అభిమానులను ఆందోళనకు గురిచేసింది. 2011లో అజారుద్దీన్ కొడుకు అయాజుద్దీన్ కూడా బైక్ యాక్సిడెంట్‌లో తీవ్ర గాయాలపాలై ఐదురోజుల పాటు మృత్యువుతో పోరాడి చనిపోయిన ( Mohammad Azharuddin's died in road accident ) సంగతి తెలిసిందే. అజారుద్దీన్ కారుకు ప్రమాదం జరిగింది అని తెలియగానే 10 ఏళ్ల క్రితం జరిగిన ఆనాటి ఘటన ఆయన అభిమానుల కళ్ల ముందు మెదిలింది.

Also read : Ban on international flights: ఇంటర్నేషనల్ ఫ్లైట్స్‌పై నిషేధాన్ని పొడిగించిన కేంద్రం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News