టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి..!

చిట్టగాంగ్ టెస్టులో బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించింది. మళ్లీ ఇప్పుడు ఆ రికార్డును బంగ్లాదేశ్ బద్దలుకొట్టింది.

Last Updated : Feb 2, 2018, 12:55 PM IST
టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి..!

చిట్టగాంగ్ టెస్టులో బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించింది. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు, తొలి ఇన్నింగ్స్‌లో 513 పరుగులకు ఆలౌటైన బంగ్లాదేశ్‌కు టెస్టుల్లో ఇది 5వ అత్యధిక స్కోరు. అంతేకాదు.. ఒక 'బై' కానీ, 'లెగ్‌ బై' కానీ లేకుండా 513 పరుగులు చేయడం టెస్టు క్రికెట్ చరిత్రలో ఇదే మొదటిసారి.గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరు మీద ఉండేది. 2014లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో కంగారూ జట్టు ఏడు వికెట్ల నష్టానికి 494 పరుగులు చేసింది. ఈ మొత్తం స్కోరులో 'ఒక బై' కానీ, ఒక 'లెగ్ బై' కానీ లేదు. మూడేళ్ల తర్వాత, మళ్లీ ఇప్పుడు ఆ రికార్డును బంగ్లాదేశ్ బద్దలుకొట్టింది.

ఈ టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్.. తొలి ఇన్నింగ్స్‌లో 513 చేసి ఆలౌట్ అయ్యింది. మొమినుల్ హక్ 176 పరుగులు, ముష్ఫికర్ రహీం 92 పరుగులు చేశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక గురువారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 187 పరుగులు చేసింది.

Trending News