కడప: మహిళల క్రికెట్‌లో సరికొత్త రికార్డు నమోదైంది. ఓ వన్డే మ్యాచ్‌లో బౌలర్ కశ్వీ గౌతమ్ హ్యాట్రిక్ వికెట్లు సహా మొత్తం పదికి 10 వికెట్లు తీసి అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకుంది. కడపలోని కేఎస్ఆర్ఎం కాలేజీ గ్రౌండ్ ఇందుకు వేదికైంది. బీసీసీఐ అండర్ 19 వన్డే ట్రోఫీలో భాగంగా అరుణాచల్ ప్రదేశ్, చండీగఢ్ జట్లు తలపడ్డాయి. టాస్ నెగ్గిన చండీగఢ్ జట్టు కశ్వీ గౌతమ్ చెలరేగడంతో 50 ఓవర్లలో 4 వికెట్లకు 186 పరుగులు చేసింది.
Also Read: ఐపీఎల్ 2020 షెడ్యూల్ ఖరారు.. తొలి, చివరి మ్యాచ్ వారిదే!
187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అరుణాచల్ ప్రదేశ్ జట్టును చండీగఢ్ బౌలర్ కశ్వీ గౌతమ్ ఓ ఆటాడుకుంది. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే అరుణాచల్ టీమ్ ఖాతా తెరవకముందే రెండు వికెట్లు కశ్వీకి సమర్పించుకుంది. లైన్ అండ్ లెంగ్త్‌తో పాటు ఇన్ స్వింగర్లు సంధిస్తూ వికెట్ టు వికెట్ బౌలింగ్ చేయడంతో ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో నాలుగు, అయిదు, ఆరు బంతులకు వికెట్లు తీసి హ్యాట్రిక్ సాధించింది. ఇన్నింగ్స్ 5వ ఓవర్లో 2,3 బంతులకు వికెట్లు తీసిన కశ్వీ గౌతమ్ తొలి హ్యాట్రిక్ మిస్ చేసుకుంది.
Also Read: క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు రాస్ టేలర్
Hat-trick ✅
10 wickets in a one-day game ✅
49 runs with the bat ✅
Leading from the front ✅4.5-1-12-10! 👌👌
Kashvee Gautam stars as Chandigarh beat Arunachal Pradesh in the @paytm Women’s Under 19 One Day Trophy. 👏👏 #U19Oneday
Scorecard 👉👉 https://t.co/X8jDMMh5PS pic.twitter.com/GWUW9uUgtF
— BCCI Women (@BCCIWomen) February 25, 2020
ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో 2,3,5 బంతులకు వికెట్లు తీసి ప్రత్యర్థి అరుణాచల్ ప్రదేశ్ జట్టును సింగిల్ ఉమెన్ ఆర్మీగా ఆలౌట్ చేసి చరిత్ర తిరగరాసింది. మొత్తంగా రెండుసార్లు హ్యాట్రిక్ అవకాశాలు చేజారాయి. అయినా కశ్వీ గౌతమ్ 4.5 ఓవర్లలో కేవలం 12 పరుగులు ఇచ్చి 10 వికెట్లతో చెలరేగడంతో ప్రత్యర్థి జట్టు కేవలం 8.5 ఓవర్లలోనే ఆలౌటై దారుణ పరాభవాన్ని చవిచూసింది.
Also Read: సన్ రైజర్స్ హైదరాబాద్ IPL 2020 షెడ్యూల్.. SRH తొలి మ్యాచ్ ఎవరితో!
కశ్వీ నిప్పులు చెరిగే బంతులకు 8 మంది అరుణాచల్ బ్యాట్స్ ఉమెన్స్ డకౌట్ అయ్యారు. కాగా, బ్యాటింగ్‌లోనూ మెరిసిన కశ్వీ 49 పరుగులు చేసి చండీగఢ్ టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఈ మేరకు బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్‌లో వీడియో పోస్ట్ చేసింది.
Also Read: తనకంటే 37 ఏళ్లు పెద్ద వ్యక్తితో నటి రిలేషన్
See Photos: బుల్లితెర భామ.. మాల్దీవుల్లో హంగామా