Sachin Tendulkar: సచిన్ టెండూల్కర్ తన కెరీర్‌లో ఎన్నో రికార్డులు సాధించాడు. అందులో అన్నింటికన్నా పెద్ద రికార్డు 100 ( 100 Centuries ) సెంచరీలు. ఈ రికార్డును మరే క్రికెటర్ బ్రేక్ చేయడం సాధ్యం కాదు అని చాలా మంది అనుకునేవారు. అయితే సచిన్ రికార్డులను టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ( Virat Kohli ) మాత్రమే బ్రేక్ చేయగలడు అని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ ( Brad Hogg ) తెలిపాడు. విరాట్ కోహ్లీ టెస్టు, వన్డేల్లో కలిపి మొత్తం 70 సెంచరీలు సాధించాడు. కోహ్లీ గత కొన్నేళ్లుగా నిర్వరామంగా అద్భుతమైన ఆటతీరు కనపరుస్తున్నాడు. ఇలాగే కొనసాగిస్తే మాత్రం త్వరలోనే సచిన్ టెండూల్కర్ వంద సెంచరీల ( Kohli To Break Sachin Records ) రికార్డును కోహ్లీ ఏదోక రోజు బ్రేక్ చేస్తాడని బ్రాడ్ హాగ్ తెలిపాడు. Also Read : World Chocolate Day: డార్క్ చాక్లెట్ వల్ల ఎన్ని లాభాలో
మాస్టర్ బ్లాస్టర్ ( Master Blaster ) సచిన్ టెండూల్కర్ సాధించిన 100 సెంచరీలతో 49 వన్డే సెంచరీలు, 51 టెస్టు సెంచరీలు ఉన్నాయి. అయితే ఇప్పటికే విరాట్ కోహ్లీ వన్డేల్లో ( Virat Kohli Centuries ) 43 సెంచరీలు సాధించి సచిన్ రికార్డుకు చేరువలో ఉన్నాడు. అయితే టెస్టుల్లో మాత్రం కోహ్లీ 27 శతకాలు సాధించాడు. ఈ రోజుల్లో వన్డే మ్యాచులు పెరిగాయి. కాబట్టి ఆ రికార్డు బ్రేక్ చేయడం అంత ఎక్కువగా సమయం పట్టదు. అయితే టెస్టులు తగ్గాయి కాబట్టి సచిన్ టెస్టుల రికార్డు ( Sachin Tendulkar Records ) బ్రేక్ చేయడం కాస్త ఆలస్యం జరగవచ్చు. అయితే ప్రస్తుతం కోహ్లీకి ఈ రికార్డు ( Records By Virat Kohli ) బ్రేక్ చేయడం అంత కష్టం ఏమీ కాదు అని తెలిపాడు బ్రాడ్ హాగ్. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..