These Celebrities Got Divorced In 2024: ఈ ఏడాదిని విడాకుల నామ సంవత్సరంగా పిలవవచ్చు. సినీ, క్రీడా ప్రముఖులు భారీగా విడాకులు తీసుకున్నారు. ఏఆర్ రహమన్, సానియా మీర్జా, ధనుష్, హార్దిక్ పాండ్యా తదితరులు విడాకులు పొందారు. తమ వైవాహిక జీవితాన్ని రద్దు చేసుకున్నారు.
Urmila Matondkar Covid Positive: బాలీవుడ్ నటి, రాజకీయ నాయకురాలు ఊర్మిళా మటోంద్కర్ కు (Urmila Matondkar News) కరోనా సోకింది. దీంతో ఆమె ఇంటికే పరిమితమై.. క్వారంటైన్ లో సమయాన్ని గడుపుతున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ లో వెల్లడించారు.
బాలీవుడ్ నటి ఊర్మిళా మతోండ్కర్ (Urmila Matondkar) మహారాష్ట్ర అధికార పార్టీ శివసేన ( Shiv Sena ) లో చేరారు. మంగళవారం మహారాష్ట్ర సీఎం, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray ) సమక్షంలో ముంబైలో ఆమె ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
బాలీవుడ్ నటి ఊర్మిళ మతోండ్కర్ (Urmila Matondkar) పేరు మహారాష్ట్ర శాసన మండలికి దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. గవర్నర్ కోటాలో మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు నటి ఊర్మిళ పేరును మహారాష్ట్ర ప్రభుత్వం (Maharashtra government ) నామినేట్ చేయనుంది.
బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ( Sushant singh rajput ) ఆత్మహత్య నాటినుంచి నటి కంగనా రనౌత్ ( kangana ranaut ) అందరిపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కంగనా.. బాలీవుడ్ ప్రముఖుల నుంచి మొదలుపెట్టి ఏకంగా మహారాష్ట్ర శివసేన ప్రభుత్వంపై, అగ్ర నాయకులపై పలు ఆరోపణలు సైతం చేసింది.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణ వ్యవహారం సంగతేమో గానీ..కంగనా మాత్రం అందరిపై విరుచుకుపడుతోంది. మొన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి టార్గెట్ కాగా..నిన్న జయాబచ్చన్. ఇప్పుడు ఊర్మిళా మటోండ్కర్. ఊర్మిళానైతే ఏకంగా అడల్ట్ స్టార్ అంటూ వ్యాఖ్యానించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.