కామన్వెల్త్ గేమ్స్‌లో నిన్నే టేబుల్ టెన్నిస్‌లో భారత మహిళల జట్టు స్వర్ణ పతకం సాధించి చరిత్రను తిరగరాసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పురుషుల జట్టు కూడా అదే బాటలో పయనించి మరో స్వర్ణాన్ని దేశానికి తీసుకురావడం విశేషం. భారత్, నైజీరియాని 3-0 స్కోరుతో ఓడించడంతో టేబుల్ టెన్నిస్‌లో మరో రికార్డు నమోదైంది.
టేబుల్ టెన్నిస్ క్రీడాకారులు శరత్ కమల్, జి సత్యన్ తొలి రెండు గేమ్స్‌లో విజయాన్ని నమోదు చేయగా.. హర్మీత్ సింగ్ దేశాయ్, జి సత్యన్‌తో కలిసి డబుల్స్‌లో సత్తా చాటడంతో భారత్ టీమ్ ఈవెంట్‌లో స్వర్ణాన్ని దక్కించుకుంది.ప్రస్తుతం ఈ స్వర్ణంతో భారత్ ఓవరాల్‌గా నాలుగు గోల్డ్ మెడల్స్‌తో మూడవ స్థానంలో కొనసాగుతోంది. ఇదే రోజు కామన్వెల్త్‌లో భారత్‌కు మరో మూడు పతకాలు దక్కాయి.
News Flash: Medal Alert | India win GOLD Medal in Table Tennis Men's Team Event as they beat Nigeria 3-0 in Final. Its 9th Gold Medal for India. Earlier Indian Women's Team won Gold yesterday. yupeeeeeeeee #CWG2018 pic.twitter.com/LullpflQQ2
— India@Sports (@India_AllSports) April 9, 2018
Our Table Tennis boys on the victory podium flashing their Gold Medals #CWG2018 #ProudMoment pic.twitter.com/j7TtFeSzHF
— India@Sports (@India_AllSports) April 9, 2018
కామన్వెల్త్ టేబుట్ టెన్నిస్‌లో మరో రికార్డు: స్వర్ణం సాధించిన పురుషుల జట్టు