న్యూఢిల్లీ: భారత ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) మంగళవారం నాడు బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ట్విట్టర్ పై స్పందించింది. తన తండ్రి హర్విర్ సింగ్ పేరును ఎందుకు అధికారిక జాబితాలో నుంచి తొలగించారని సైనా ఆగ్రహం వ్యక్తం చేయగా... ఐఓఏ వివరణ ఇచ్చింది.
"డియర్ సైనా, గోల్డ్ కోస్ట్ 2018 కామన్వెల్త్ యొక్క సీడీఎం మాన్యువల్ లో పేర్కొన్నట్లు హర్విర్ సింగ్ గుర్తింపు పొందిన ఓ అదనపు అఫీషియల్! ఆ గుర్తింపు ఉన్న వారికి క్రీడా గ్రామంలో ట్రావెల్ గ్రాంట్/బెడ్ కలిసి ఉండదు"అని ట్వీట్ లో పేర్కొన్నారు. దాంతో పాటు ఒక డాక్యుమెంట్ ను కూడా జోడించి ట్వీట్ చేశారు.
Dear @NSaina , Mr. Harvir Singh is an accredited Extra Official! As stated in the CDM Manual of Gold Coast 2018 CWG and repeatedly conveyed to BAI, the payment for accreditation of Extra Official does not include bed in the Games Village. @Abhinav_Bindra @kannandelhi pic.twitter.com/Nl00WxS685
— IOA - Team India (@ioaindia) April 3, 2018
సోమవారం.. తండ్రి హర్వీర్‌సింగ్‌కు క్రీడా గ్రామంలో అనుమతి లేదని నిర్వాహకులు చెప్పడంతో సైనా ట్విటర్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల ఐదు నుంచి కామన్వెల్త్ క్రీడలు జరగనున్నాయి. భారత్ నుంచి కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే ప్లేయర్లతో పాటు వారి కుటుంబసభ్యులు కూడా క్రీడల్లో పాల్గొనేందుకు భారత ప్రభుత్వం అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. సోమవారం సైనాతో పాటు ఆమె తండ్రి గోల్డ్‌కోస్ట్ చేరుకున్నారు. కామన్వెల్త్‌కు వెళ్లే భారత బృందం జాబితాలో హర్వీర్ పేరుంది. కానీ అక్కడికి వెళ్లి సంప్రదించగా లిస్టులో పేరు లేదని అధికారులు తెలిపారు.
ప్రభుత్వ ఖర్చు లేకుండా సైనా తండ్రి హర్వీర్‌సింగ్, పీవీ సింధు తల్లి విమల ఆయా క్రీడాకారిణులు తమ సొంత ఖర్చులతో గోల్డ్‌కోస్ట్ వెళ్లేందుకు క్రీడా మంత్రిత్వశాఖ అనుమతినిచ్చింది. ప్రభుత్వ ఖర్చు లేకుండా మొత్తం 15 అఫీషియల్స్, నాన్-అథ్లెట్లు గోల్డ్‌కోస్ట్ వెళ్లే భారత బృందంలో ఉన్నారు. మరోవైపు పీవీ సింధు తల్లిని మాత్రం ఆమెతో క్రీడాగ్రామంలోకి అధికారులు అనుమతించారు.