Dwayne Bravo Retirement: ఇంటర్నేషనల్ క్రికెట్ కు వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో రిటైర్మెంట్

Dwayne Bravo Retirement: వెస్టిండీస్ ఆల్​రౌండర్ డ్వేన్ బ్రావో (Bravo Retirement) తన కెరీర్​కు సంబంధించి కీలక ప్రకటన చేశాడు. టీ20 ప్రపంచకప్​ (T20 World Cup) అనంతరం అంతర్జాతీయ క్రికెట్​కు గుడ్​బై చెప్పనున్నట్లు పేర్కొన్నాడు. గురువారం శ్రీలంక-వెస్టిండీస్​ మ్యాచ్(SL vs WI T20) అనంతరం రిటైర్మెంట్​పై బ్రావో క్లారిటీ ఇచ్చాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 5, 2021, 08:07 AM IST
    • అంతర్జాతీయ క్రికెట్ కు వెస్టిండీస్ ఆల్ రౌండర్ బ్రావో వీడ్కోలు
    • శ్రీలంకతో మ్యాచ్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించిన బ్రావో
    • టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత నుంచి తన రిటైర్మెంట్ పరిగణించాలని వెల్లడి
Dwayne Bravo Retirement: ఇంటర్నేషనల్ క్రికెట్ కు వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో రిటైర్మెంట్

Dwayne Bravo Retirement: వెస్టిండీస్​ ఆల్​రౌండర్ డ్వేన్ బ్రావో (Bravo Retirement) అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం జరుగుతోన్న టీ20 ప్రపంచకప్​ టోర్నీ(T20 World Cup) ముగిశాక రిటైర్​ అవనున్నట్లు ప్రకటించాడు. గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్​లో విండీస్ ఓటమి అనంతరం ఈ ప్రకటన చేశాడు.

"వీడ్కోలుకు సమయం వచ్చేసింది. 18 ఏళ్లుగా వెస్టిండీస్​ జట్టులో ఆడుతున్నా. ఈ ప్రయాణంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నా. కానీ, కరీబియన్​ జట్టులో ఆడటం ఎల్లప్పుడూ అదృష్టంగానే భావిస్తా" అని డ్వేన్ బ్రావో అన్నాడు.

మూడు ఐసీసీ ట్రోఫీలు నెగ్గి అంతర్జాతీయ స్థాయిలో వెస్టిండీస్​ పేరు నిలబెట్టుకున్నామని బ్రావో అన్నాడు. రెండు ట్రోఫీలు డారెన్ సామి కెప్టెన్సీలోనే పొందినట్లు గుర్తుచేసుకున్నాడు. గురువారం లంకతో మ్యాచ్​ అనంతరం ఫేస్​బుక్​ లైవ్​లో ఈ వ్యాఖ్యలు చేశాడు బ్రావో.

అయితే, టీ20 ప్రపంచకప్​లో (T20 World Cup 2021) సెమీస్​కు ఏమాత్రం అవకాశం లేని శ్రీలంక జట్టు.. తన ఆఖరి గ్రూప్​ మ్యాచ్​లో అదరగొట్టింది. గురువారం జరిగిన మ్యాచ్​లో వెస్టిండీస్​పై (SL Vs WI) 20 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో విండీస్​ సెమీస్​ ఆశలపైనా నీళ్లు చల్లింది. లంక నిర్దేశించిన 190 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో కరీబియన్ బ్యాటర్లు విఫలమయ్యారు. 20 ఓవర్లలో 169 పరుగులు మాత్రమే చేశారు. నికోలస్ పూరన్ (46), హెట్​మెయిర్ (81) రాణించారు. లంక బౌలర్లలో ఫెర్నాండో, కరుణరత్నె రెండు వికెట్ల చొప్పున పడగొట్టారు.  

Also Read: Sri Lanka Vs West Indies: ఆఖరి మ్యాచ్లో అదరగొట్టిన శ్రీలంక.. వెస్టిండీస్ సెమీస్ ఆశలు గల్లంతు

Also Read: T20 World Cup 2021: భారత్ సెమీస్ చేరాలంటే.. ఈ అద్భుతాలు జరగాల్సిందే!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

 

 

Trending News