Dwayne Bravo Super Six: సూపర్‌ 'సిక్స్‌'.. డ్వేన్‌ బ్రావో దెబ్బకు స్టేడియం దాటేసిన బంతి

మేజర్ లీగ్ క్రికెట్‌ - 2023 సిరీస్ లో భాగంగా టెక్సాస్ సూపర్‌ కింగ్స్.. వాషింగ్టన్‌ ఫ్రీడమ్‌ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో డ్వేన్‌ బ్రావో కొట్టిన షాట్ కి.. బంతి స్టేడియం దాటి వెళ్లింది. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 17, 2023, 06:57 PM IST
Dwayne Bravo Super Six: సూపర్‌ 'సిక్స్‌'.. డ్వేన్‌ బ్రావో దెబ్బకు స్టేడియం దాటేసిన బంతి

Dwayne Bravo Super Six: మేజర్ లీగ్ క్రికెట్‌ - 2023 సిరీస్ లో భాగంగా టెక్సాస్ సూపర్‌ కింగ్స్.. వాషింగ్టన్‌ ఫ్రీడమ్‌ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.  ఇప్పటి వరకు అపజయం ఎరుగని టెక్సాస్ సూపర్‌ కింగ్స్ తొలి ఓటమిని చవిచూసింది. ఆదివారం మ్యాచ్ లో వాషింగ్టన్ ఫ్రీడమ్ ఆల్ రౌండర్ ప్రతిభతో విజయాన్ని సొంతం చేసుకుంది. 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టెక్సాస్‌ సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి కేవలం 157 పరుగులు మాత్రమే చేసింది. 

ఈ మ్యాచ్ లో టెక్సాస్ ఆల్ రౌండర్ డ్వేన్‌ బ్రావో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడటంతో ఘోరమైన ఓటమి బారి నుండి తప్పించుకున్నారు. కేవలం 39 బాల్స్‌ ఆడిన బ్రావో ఏకంగా 79 పరుగులు చేశాడు. ముఖ్యంగా చివరి ఓవర్‌ లో అతడు చేసిన పరుగులు చూసి అంతా కూడా విజయం టెక్సాస్ ను వరిస్తుందా అని భావించారు. కానీ ఆరు పరుగుల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

మ్యాచ్‌ 17 ఓవర్ లో అన్రిచ్ నోర్జే వేసిన షార్ట్‌ ఫిచ్ బంతిని ఆడిన బ్రావో లాంగ్ ఆన్‌ మీదుగా ఆడిన షాట్ కి అంతా కూడా ఫిదా అయ్యారు. ఆ షార్ట్‌ స్టాంగ్స్ నుండి బయట పడింది. స్టేడియం బయట పడటంతో మ్యాచ్ కి ఇదే హైలైట్ అంటూ ప్రేక్షకులు మాట్లాడుకుంన్నారు. 103 మీటర్ల భారీ సిక్స్ గా పేర్కొన్నారు. ఈ రేంజ్ లో సిక్స్ లు కొట్టినా కూడా బ్రావో తన జట్టుకు విజయాన్ని అందించడంలో విఫలం అయ్యాడు. 

అతడి ఇన్నింగ్స్ ఒక్క ఓవర్‌ ముందు ప్రారంభం అయినా కూడా అద్భుతమైన విజయంను టెక్సాస్ సూపర్ కింగ్స్ దక్కించుకునేది అంటూ క్రీడా పండితులు మాట్లాడుకుంటున్నారు. ఈ మ్యాచ్ లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడియన బ్రావో కి ముందు ముందు మ్యాచ్ లో అద్భుత ఇన్నింగ్స్ ఆడటం ఖాయం... సెంచరి చేయడం కూడా ఖాయం అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. 

Also Read: Rajya Sabha Elections: రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం.. 11 మంది సభ్యులు ఎన్నిక  

టెక్సాస్ సూపర్ కింగ్స్ కెప్టెన్‌ డుప్లెసిస్‌.. డెవాన్ కాన్వే వంటి స్టార్‌ క్రికెటర్స్ విఫలం అవ్వడంతో 73 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. అప్పుడే క్రీజులోకి వచ్చిన బ్రావో ప్రత్యర్థి జట్టు బౌలర్లకు చుక్కలు చూపిస్తూ తక్కువ సమయంలోనే జట్టు విజయంపై నమ్మకం కలిగించాడు. కానీ చివరి ఓవర్ వరకు విజయం ఇరు జట్ల మధ్య దోబూచులాడి చివరకు వాషింగ్టన్‌ కి దక్కింది. 

చివరి ఓవర్ లో 27 పరుగులు అవసరం అవ్వగా బ్రావో 20 పరుగులు రాబట్టాడు. అతడి జోరు చూస్తూ ఉంటే చివరి ఓవర్‌ వరకు కచ్చితంగా విజయాన్ని అందుకునే అవకాశాలు ఉన్నాయి అని అంతా భావించారు. కానీ క్రీజులో ఉన్న బ్రావో కూడా ఆ భారీ లక్ష్యం ను ఛేదించడం లో విపలం అయ్యాడు.

Also Read: Tips For Teeth Whiten: ఈ టిప్స్ పాటించండి.. మీ దంతాలను తెల్లగా మెరిసేలా చేసుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News