Teeth Whitening Tips in Telugu: మన వ్యక్తం చేయలేని భావాలను ఒక్క స్మైల్‌తో చెప్పవచ్చు. మీరు ఎంత ఎక్కువగా నవ్వితే అంత ఆరోగ్యకరంగా ఉంటారు. అయితే మీ దంతాలు తెల్లగా ఉంటేనే పది మందిలో పబ్లిక్‌గా గట్టిగా నవ్వగలుగుతారు. లేదంటే ముఖానికి చేయి అడ్డుపెట్టుకుని నవ్వే పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియా వినియోగం పెరగడంతో ఫాలోవర్స్, లైక్స్ కోసం స్మైలీ ఫొటోషూట్స్ చేసేందుకు యువత ఆసక్తి చూపుతున్నారు. మీ దంతాలు పచ్చగా ఉంటే.. వాటిని పెదాలతో కవర్ చేస్తూ ఫొటోలకు పోజులు ఇవ్వాల్సి ఉంటుంది. పచ్చగా ఉన్న మీ పళ్లను ఇంట్లోనే ఎలాంటి ఇబ్బంది లేకుండా తలతల మెరిసేలా చేసుకోవచ్చు. ఈ టిప్స్ మీరు పాటించి.. మీ దంతాలను తెల్లగా చేసుకోండి.
బేకింగ్ సోడా, లెమన్
బేకింగ్ సోడా నేచురల్ క్లెన్సర్‌గా పనిచేస్తుంది. నిమ్మకాయలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ రెండింటిని కలిపితే.. మీ నోటి ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. బేకింగ్ సోడా, నిమ్మకాయను ఒక గిన్నెలో తీసుకోండి. ఒకటి నుంచి రెండు టీస్పూన్ల బేకింగ్ పౌడర్, ఒక నిమ్మరసాన్ని బాగా కలపాలి. అనంతరం టూత్ బ్రష్ సహాయంతో పళ్ల మీద తోమండి. మీ దంతాలు తెల్లగా మారడమే కాకుండా.. బ్యాక్టీరియాను కూడా కూడా తొలగించేందుకు దోహద పడుతుంది.
ఆరెంజ్, నిమ్మ
నారింజ, నిమ్మ వంటి సిట్రస్ పండ్లు దంతాలలో ఉండే బ్యాక్టీరియాను తొలగిస్తాయి. దంతాలను శుభ్రపరచడంలో కూడా చాలా సహాయపడతాయి. ఈ పండ్లను క్రమం తప్పకుండా తీసుకుంటే.. నోటిని ఆరోగ్యంగా ఉంచుతాయి. మీరు నారింజ, నిమ్మ తొక్కలను పళ్లపై రుద్దడం ద్వారా దంతాలను శుభ్రంగా ఉంచుకోవచ్చు.
ఆయిల్ పుల్లింగ్
ఆయిల్ పుల్లింగ్ అనేది పురాతనంలో కాలంలో ఉపయోగించిన పద్ధతి. పేస్ట్‌లు, బ్రష్‌లు అందుబాటులో రాకముందు ఆయిల్ పుల్లింగ్‌ను ఉపయోగించేవారు. ఈ ఆయిల్‌ను కాసేపు నోట్లో ఉంచుకుని దంతాలను శుభ్రం చేసుకుంటే.. పసుపు రంగు మొత్తం తొలగిపోతుంది.
యాపిల్ సైడర్ వెనిగర్
యాపిల్ వెనిగర్‌ను యాపిల్ సైడర్ వెనిగర్ అని కూడా పిలుస్తారు. ఇది బ్యాక్టీరియాను తరిమికొట్టడంతో సమర్థవంతంగా పనిచేస్తుంది. మీ దంతాలను తెల్లగా చేయాలనుకుంటే.. శుభ్రమైన నీటిలో కరిగించి.. ఆ నోటితో శుభ్రం చేసుకోండి. మీ చిగుళ్లకు ఎలాంటి హాని కలగకుండా మీ పళ్లను తెల్లగా మారుస్తుంది.
(గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS ధృవీకరించలేదు.)
Also Read: Red Light In Smart Meter: విద్యుత్ మీటర్‌లో రెడ్ లైట్ గురించి తెలుసా..! నెలకు ఎంత చెల్లించాలంటే..?
Also Read: Interesting Facts: ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఇదే..! జనాభా ఎంతంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి