Jason Roy pulls out of IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 ఆరంభానికి ముందే కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్‌కు భారీ షాక్ తగిలింది. బయో బబుల్ కారణంగా ఐపీఎల్ 15వ సీజన్ నుంచి తాను తప్పుకుంటున్నట్లు ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ జేసన్ రాయ్ ప్రకటించాడు. ఈ విషయాన్ని తన ప్రాంచైజీ కూడా చెప్పినట్టు పేర్కొన్నాడు. గత నెలలో బెంగళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ 2022 మెగా వేలంలో రాయ్‌ను రూ.2 కోట్ల కనీస ధరకు గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది.
'ప్రతి ఒక్కరికి నమస్కారం. ముఖ్యంగా గుజరాత్ టైటాన్స్ జట్టు మరియు అభిమానులకు. ఈ నిర్ణయం తీసుకోవడం కాస్త కఠినమే అయినా తప్పలేదు. చాలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. ఐపీఎల్ 2022 నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నా. నాపై నమ్మకంతో ఐపీఎల్ వేలంలో ఎంపిక చేసుకున్న గుజరాత్ జట్టు మేనేజ్‌మెంట్, కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు కృతజ్ఞతలు. అందరూ నా నిర్ణయాన్ని గౌరవిస్తారని అనుకుంటున్నా' అని ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ జేసన్ రాయ్ ట్వీట్ చేశాడు.
'గత మూడేళ్లుగా ప్రపంచంలో జరుగుతున్న కరోనా వైరస్ మహమ్మారి పరిణామాలు నాపై కూడా తీవ్ర ప్రభావం చూపాయి. కుటుంబంతో కలిసి విలువైన సమయాన్ని వెచ్చించేందుకు ఇదే సరైన సమయమని భావించా. ఈ ఏడాది తీరిక లేని క్రికెట్ షెడ్యూల్ నేపథ్యంలో వచ్చే కొన్ని నెలలు నా ఆటతీరు మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తాను. గుజరాత్ టైటాన్స్‌కు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. గుజరాత్ ఆడే ప్రతి మ్యాచ్‌ను చూస్తా. తొలి ఏడాదే ఐపీఎల్ ట్రోఫీ కైవసం చేసుకోవాలని ఆశిస్తున్నా' అని జేసన్ రాయ్ పేర్కొన్నాడు.
IPL 2022. pic.twitter.com/fZ0LofBgSE
— Jason Roy (@JasonRoy20) March 1, 2022
ఐపీఎల్ నుంచి జేసన్ రాయ్ వైదొలగడం ఇది రెండోసారి. 2020లో వ్యక్తిగత కారణాలతో రాయ్ తప్పుకున్నాడు. అప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ రాయ్‌ను రూ.1.5 కోట్లకు కొనుక్కుంది. ఇక గతేడాది జరిగిన తొలి ఫేజ్ ఐపీఎల్‌కు అతడు దూరం కాగా.. రెండో ఫేజ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడాడు. ఇక ఇప్పుడు మరోసారి పూర్తి టోర్నీకి దూరమయ్యాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఆడిన రాయ్ కేవలం 6 మ్యాచ్‌లలోనే 303 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. శుభ్‌మన్ గిల్‌తో పాటు రాయ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించేలా గుజరాత్ ప్రణాళికలు చేసుకున్నా.. ఇప్పుడు తారుమారు అయ్యాయి.
Also Read: Dog Death Video: అచ్చు మనుషుల మాదిరే.. కుక్కకు దహన సంస్కారాలు చేసిన తోటి శునకాలు!!
Also Read: Ukraine Crisis: రష్యన్ మిలటరీ ట్యాంకును ఎత్తుకెళ్లిన ఉక్రెయిన్ రైతు, వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి