కోహ్లికి ఉన్నంత ఎనర్జీ ధోనికి లేదు... సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు...

Sanjay Manjrekar compares Virat and MS Dhoni: మాజీ కెప్టెన్లు ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లి.. ఈ ఇద్దరిలో ఎవరు బెస్ట్ అంటే ఏం చెబుతారు... కెప్టెన్‌గా కోహ్లి వైదొలగిన తర్వాత దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్, కామేంటేటర్ సంజయ్ మంజ్రేకర్ ఈ ఇద్దరినీ పోలుస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 26, 2022, 06:44 PM IST
  • కోహ్లి, ధోనీలపై సంజయ్ మంజ్రేకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
  • ఫీల్డ్‌లో ధోని కంటే విరాట్ ఎనర్జిటిక్ అని కామెంట్
  • కేఎల్ రాహుల్ సారథ్యంపై ఇప్పుడే స్పందించలేనన్న మంజ్రేకర్
కోహ్లికి ఉన్నంత ఎనర్జీ ధోనికి లేదు... సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు...

Sanjay Manjrekar compares Virat and MS Dhoni: గత కొద్దిరోజులుగా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి (Virat Kohli) గురించి అటు మీడియాలో, ఇటు సోషల్ మీడియాలో ఎడ తెగని చర్చ జరుగుతోంది. ఇటీవలి కాలంలో అన్ని ఫార్మాట్లకు కోహ్లి కెప్టెన్‌గా వైదొలగడం.. మైదానంలో అతని పేలవ ప్రదర్శనపై అటు క్రీడా పండితులు, ఇటు అభిమానులు ఎవరి విశ్లేషణలు వారు వినిపిస్తున్నారు. అదే సమయంలో మాజీ కెప్టెన్ ధోనితో (MS Dhoni) విరాట్ కోహ్లిని పోలుస్తూ.. ఇద్దరిలో ఎవరు గొప్ప అనే చర్చ చేస్తున్నారు. తాజాగా ఇదే అంశంపై స్పందించిన మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

'మైదానంలో విరాట్ కోహ్లిలో ఉండేంత ఎనర్జీ ఎంఎస్ ధోనికి (MS Dhoni) లేదు. అయినప్పటికీ ధోని మంచి ఫలితాలు సాధించాడు. కాబట్టి ఎనర్జీ ఒక్కటే కోహ్లి గెలుపోటములకు ప్రాతిపదిక కాదు.  ప్లేయింగ్ XIని బట్టే నేను నాయకుడిని జడ్జ్ చేస్తాను. అయితే కోహ్లితో అదే పెద్ద సమస్య.' అని సంజయ్ మంజ్రేకర్ పేర్కొన్నారు. విరాట్ కెప్టెన్‌గా వైదొలగడంతో.. టీమిండియా అగ్రెసివ్‌నెస్, ఇంటెన్సిటీని కోల్పోతుందా అన్న ప్రశ్నకు సంజయ్ మంజ్రేకర్ ఇలా బదులిచ్చారు. అంతేకాదు, టెస్టుల్లో కెప్టెన్‌గా కోహ్లి ప్లేయింగ్ XI ఎంపిక సరిగా లేదని మంజ్రేకర్ అభిప్రాయడటం గమనార్హం. 

వన్డే కెప్టెన్‌గా తనను తప్పించడంతో కోహ్లికి (Virat Kohli) అసంతృప్తిగా ఉండటం సమంజసమేనా అన్న ప్రశ్నకు.. 'ఇది సిరీస్ గురించి లేదా ర్యాంకింగ్స్‌ గురించి కాదు. అభిమానులు టీమిండియా వరల్డ్ కప్ గెలవాలని మాత్రమే కోరుకుంటారు..' అని మంజ్రేకర్ పేర్కొన్నారు. టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడం వల్ల నష్టమేమీ ఉండదని కోహ్లి భావించాడన్నారు. వన్డే, టెస్టుల్లో కెప్టెన్‌గా కొనసాగాలని అతని భావించి ఉండొచ్చన్నారు. అయితే బీసీసీఐ మాత్రం కోహ్లిని తప్పించిందన్నారు.

 సౌతాఫ్రికా టూర్‌లో (South Africa) టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న  కేఎల్ రాహుల్ (KL Rahul) సారథ్యంపై ఇప్పుడే మాట్లాడటం తొందరపాటు అవుతుందని అభిప్రాయపడ్డారు. 'కేఎల్ రాహుల్ సారథ్యంపై ఇప్పుడే కామెంట్ చేయడం సరికాదు. రెండో టెస్టులో అతను మెరుగైన ప్రదర్శన కనబర్చాడు.' అని పేర్కొన్నారు.

Also Read: Khiladi Full Kicku Song: రవితేజ బర్తే డే సర్ ప్రైజ్.. ఖిలాడి సినిమాలోని ఫుల్ కిక్కు సాంగ్ రిలీజ్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News