ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డీన్ జోన్స్ (Dean Jones Passes Away) కన్నుమూశాడు. ఆయన వయసు 59 ఏళ్లు. క్రికెట్‌కు వీడ్కోలు పలికాక కామెంటెటర్‌గానూ ఆటకు విశేష సేవలందించిన వ్యక్తి డీన్ జోన్స్. ఆకస్మికంగా గుండెపోటు రావడంతో డీన్ జోన్స్ తుదిశ్వాస విడిచారని (Dean Jones Dies) స్టార్ ఇండియా రిపోర్ట్ చేసింది. డీన్ జోన్స్ మృతిపట్ల తాజా, మాజీ క్రికెటర్లు సంతాపం ప్రకటిస్తున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ట్వీట్లు చేస్తున్నారు. క్రికెట్‌కు డీన్ జోన్స్ చేసిన సేవల్ని స్మరించుకుంటున్నారు. Rohit Sharma SIXES in IPL: సిక్సర్లలో రోహిత్ శర్మ అరుదైన ఘనత.. కోహ్లీ ఎక్కడ?
రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ అయిన డీన్ జోన్స్ ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు 52 టెస్టుల్లో ప్రాతినిథ్యం వహించాడు. 11 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీల సాయంతో 46.5 సగటున 3,631 పరుగులు చేశాడు. 164 వన్డేలాడిన డీన్ జోన్స్ 7 శతకాలు, 46 అర్ధ శతకాల సాయంతో 44.6 సగటున 6,068 పరుగులు సాధించాడు. 1987లో ఆస్ట్రేలియా తొలి వన్డే వరల్డ్ కప్ నెగ్గడంతో కీలకపాత్ర పోషించిన క్రికెటర్ డీన్ జోన్స్. MI vs KKR: పాట్ కమిన్స్‌కు మద్దతుగా నిలిచిన కెప్టెన్ దినేష్ కార్తీక్
Saddened to hear the news of Dean Jones passing away. Still cannot believe it. Was one of my favourite commentators, he was on air in many of my landmarks. Had really fond memories with him. Will miss him. pic.twitter.com/FZBTqIEGdx
— Virender Sehwag (@virendersehwag) September 24, 2020
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe