Henry Nicholls Out: దేవుడా.. ఇలా కూడా ఔట్‌ అవుతారా! వీడియో చూస్తే అయ్యో పాపం అనకుండా ఉండలేరు

Henry Nicholls out in bizarre manner in Jack Leach bowling. న్యూజిలాండ్‌ బ్యాటర్‌ హెన్రీ నికోల్స్‌ విచిత్రకర రీతిలో ఔట్ అయిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Jun 24, 2022, 01:39 PM IST
  • విచిత్రకర రీతిలో హెన్రీ నికోల్స్‌ ఔట్
  • దేవుడా.. ఇలా కూడా ఔట్‌ అవుతారా
  • వీడియో చూస్తే అయ్యో పాపం అనకుండా ఉండలేరు
Henry Nicholls Out: దేవుడా.. ఇలా కూడా ఔట్‌ అవుతారా! వీడియో చూస్తే అయ్యో పాపం అనకుండా ఉండలేరు

Henry Nicholls out in bizarre manner in Jack Leach bowling: క్రికెట్ ఆటలో అప్పుడప్పుడు కొన్ని అరుదైన, ఎవరూ ఊహించని ఘటనలు జరుగుతుంటాయి. ఫీల్డర్లు తమ ఫీల్డింగ్ విన్యాసాలతో అద్భుతమైన క్యాచ్‌లు అందుకుని అందరిని ఆశ్చర్యపరుస్తారు. బ్యాటర్ ఎవరూ ఊహించని షాట్లు ఆడి ఔరా అనిపిస్తారు. అదే సమయంలో బ్యాటర్ ఊహించని రీతిలో కూడా పెవిలియన్ చేరుతుంటాడు. తాజాగా ఇలాంటి ఘటనే ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచులో చోటుచేసుకుంది. న్యూజిలాండ్‌ బ్యాటర్‌ హెన్రీ నికోల్స్‌ విచిత్రకర రీతిలో ఔట్ అయిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌  జట్ల మధ్య గురువారం మూడో టెస్ట్ మ్యాచ్ ఆరంభం అయింది. తొలి రోజు టీ విరామ స‌మ‌యం త‌ర్వాత ఇంగ్లండ్ స్పిన్న‌ర్ జాక్ లీచ్ 56 వేస్తుండగా.. హెన్రీ నికోల్స్‌ స్ట్రైకింగ్ చేస్తున్నాడు. రెండో బంతిని జాక్ లీచ్ వేయగా.. నికోల్స్ భారీ షాట్‌కు ప్ర‌య‌త్నించాడు. ముందుకు వ‌చ్చి బంతిని బలంగా బాదాడు. అయితే బంతి నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లోని డారెల్ మిచెల్ బ్యాట్ త‌గిలి గాల్లోకి లేచింది. బ్యాట్‌కు త‌గిలిన త‌ర్వాత అంపైర్ మీదుగా వెళుతూ.. మిడ్ ఆఫ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న అలెక్స్ లీస్ చేతుల్లో పడింది. ఇంకేముంది నికోల్స్‌ నిరాశగా మైదానాన్ని వీడాడు. 

హెన్రీ నికోల్స్‌ ఔట్‌ కాగానే ఇంగ్లండ్‌ బౌలర్లు సంబురాలు జరుపుకోగా.. బౌలర్‌ జాక్  లీచ్‌ మాత్రం కాసేపు ఆశ్చర్యంగా అలా ఉండిపోయాడు. నికోల్స్ ఎలా అవుట్ అయ్యాడో అతనికి అర్థం కాక అలా ఉండిపోయాడు. జరిగిందేంటో అర్థం చేసుకోవడానికి అతడికి  కొంత సమయం పట్టింది. ఈ క్యాచుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై అభిమానులు కామెంట్స్, లైకుల వర్షం కురిపిస్తునున్నారు. 'దేవుడా.. ఇలా కూడా ఔట్‌ అవుతారా' అని ఒకరు కామెంట్ చేయగా.. 'అయ్యో పాపం అనకుండా ఉండలేకపోతున్నా' అని ఇంకొకరు ట్వీట్ చేశారు. 

మూడో టెస్టులో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ తొలి రోజు ఆట ముగిసేసమయానికి.. తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 225 రన్స్ చేసింది. పేసర్ స్టువర్ట్ బ్రాడ్‌ (2/45), స్పిన్నర్ జాక్ లీచ్‌ (2/75)ల దెబ్బకు ఇంగ్లీష్ జట్టు 123 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో కివీస్‌ను డరైల్‌ మిచెల్‌ (78 బ్యాటింగ్‌; 159 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), టామ్ బ్లండెల్ (45 బ్యాటింగ్‌; 108 బంతుల్లో 5 ఫోర్లు) ఆదుకున్నారు. 

Also Read: IND vs IRE 2022 Schedule: భారత్‌, ఐర్లాండ్‌ టీ20 సిరీస్‌.. జట్లు, షెడ్యూల్‌, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే!  

Also Read: Toothache Home Remedies: పంటి నొప్పులతో బాధపడుతున్నారా.. అయితే ఇది మీ కోసమే..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News