వరల్డ్ కప్‌లో టీమిండియా విజయావకాశాలపై క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ స్పందించారు. వరల్డ్ కప్ లో కచ్చితంగా టీమిండియా ఫేవరేట్ గా బరిలోకి దిగుతోందని..అయితే జట్టు సమష్టిగా రాణించినప్పుడే విజయం సాధ్యపడుతుందన్నాడు.
అంతా కోహ్లీ ఒక్కడే కాదు..
కోహ్లీ ఒక్కడు మాత్రమే రాణిస్తే వరల్డ్ కప్ గెలవలేమని...జట్టు విజయం సాధించాలంటే సమష్టితత్వం అవసరమన్నాడు.కీలకదశలో జట్టు మరింత జాగ్రత్తగా వ్యహరించాల్సి ఉందన్నాడు..చిన్న పాటి నిర్లక్ష్యం కూడా ప్రదర్శించవద్దని సూచించాడు. ఒత్తిడి సమయంలో సీనియర్లు కీలక పాత్ర పోషించాలని సచిన్ సలహా ఇచ్చాడు.
జూనియర్లు సత్తా చాటగలరు..
టీమిండియా సమష్టితత్వంపై తనకు నమ్మకం ఉందని..జట్లుకు మూలస్థంభం కోహ్లీ అయినప్పటికీ..అతని ఒక్కడిపై ఆధారపడ వద్దని సూచించాడు. షాట్ల ఎంపికలో సంయమనం పాటిస్తే జూనియర్లు కూడా కోహ్లీ తరహా ఆడగలరని సచిన్ జూనియర్లకు సలహా ఇచ్చాడు