IND Vs AFG World Cup 2023: ఆఫ్ఘనిస్థాన్‌దే బ్యాటింగ్.. టీమిండియాలో అనూహ్య మార్పు.. ఆ బౌలర్ ఔట్

India vs Afghanistan World Cup 2023 Updates: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా భారత్, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్‌ ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఆఫ్ఘాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో శార్దుల్ ఠాకూర్ టీమ్‌లోకి వచ్చాడు. 

Written by - Ashok Krindinti | Last Updated : Oct 11, 2023, 02:54 PM IST
IND Vs AFG World Cup 2023: ఆఫ్ఘనిస్థాన్‌దే బ్యాటింగ్.. టీమిండియాలో అనూహ్య మార్పు.. ఆ బౌలర్ ఔట్

India vs Afghanistan World Cup 2023 Updates: వరల్డ్ కప్‌లో రెండో పోరుకు భారత్ సిద్ధమైంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఆఫ్ఘనిస్థాన్‌తో తలపడుతోంది. తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన టీమిండియా.. ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. అటు తొలి మ్యాచ్‌లో ఓడిన ఆఫ్ఘన్.. ప్రపంచకప్‌లో బోణీ కొట్టాలని చూస్తోంది. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు భారత్ ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో శార్దుల్ ఠాకూర్ జట్టులోకి వచ్చాడు. ఆఫ్ఘనిస్థాన్ చివరి మ్యాచ్‌లో ఆడిన టీమ్‌తోనే ఆడనుంది. 

"మేము మొదట బ్యాటింగ్ చేస్తాం. ఇది మంచి బ్యాటింగ్ పిచ్‌లా కనినిస్తోంది. భారత్‌ను నియంత్రించేందుకు మాకు మంచి బౌలింగ్ అటాక్ ఉంది. మేము బ్యాట్‌తో ఎక్కువ పరుగులు చేయాలని చూస్తున్నాం. మా ప్రతిభను ప్రదర్శించడానికి మంచి అవకాశం. గత మ్యాచ్‌లో ఆడిన టీమ్‌తో వెళ్తున్నాం." అని ఆఫ్ఘనిస్థాన్ కెప్టెన్ షాహిదీ తెలిపాడు.

"మేము సెకెండ్ బ్యాటింగ్ చేయాలని అనుకున్నాం. నిన్న సాయంత్రం మంచు మొత్తాన్ని చూశాం. వికెట్ చాలా మారుతుందని అనుకోవట్లేదు. ముందు బాగా బౌలింగ్ చేయాలి. తరువాత మెరుగ్గా బ్యాటింగ్ చేయాలి. మేము ఒత్తిడిలో ఆస్ట్రేలియాపై ప్రారంభించాం. కానీ కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. మా ప్రదర్శన పట్ల చాలా గర్వపడుతున్నాం. ఇది మాకు మంచి గేమ్. గత మ్యాచ్‌ ఫలితాన్ని రీపిట్ చేయాలని అనుకుంటున్నాం. ఈ మ్యాచ్‌కు అశ్విన్ స్థానంలో అశ్విన్ స్థానంలో శార్ధుల్ ఠాకూర్ టీమ్‌లోకి వచ్చాడు.." అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు.

తుది జట్లు ఇలా..

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్థిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

ఆఫ్ఘనిస్తాన్: రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, నవీన్-ఉల్-హక్, ఫరూఖల్ హాక్. 

Also Read: Child Health Tips: మీ పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యం కావాలంటే ఈ పోషకాలు తప్పనిసరి

Also Read: PM Kisan Status: రైతులకు శుభవార్త.. రూ.8 వేలకు పెంచనున్న కేంద్రం.. ఇలా అప్లై చేసుకోండి..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News