PM Kisan Status: రైతులకు శుభవార్త.. రూ.8 వేలకు పెంచనున్న కేంద్రం.. ఇలా అప్లై చేసుకోండి..!

PM Kisan Samman Nidhi Yojana 15th Installment Updates: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం నుంచి త్వరలోనే గుడ్‌న్యూస్ వచ్చే అవకాశం ఉంది. ఈ స్కీమ్ కింద ప్రస్తుతం రైతులకు రూ.6 వేలు అందుతుండగా.. దీనిని రూ.8 వేలకు పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా..  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 11, 2023, 01:19 PM IST
PM Kisan Status: రైతులకు శుభవార్త.. రూ.8 వేలకు పెంచనున్న కేంద్రం.. ఇలా అప్లై చేసుకోండి..!

PM Kisan Samman Nidhi Yojana 15th Installment Updates: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ కింద దేశవ్యాప్తంగా ఎంతోమంది రైతులు లబ్ధి పొందుతున్నారు. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా రూ.6 వేలు అందజేస్తుంది. రూ.2 వేలు చొప్పున మూడు వాయిదాల్లో నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పటివరకు 14 విడతలుగా నగదు జమ చేసింది. ప్రస్తుతం 15వ విడత కోసం అన్నదాతలు ఎదురు చూస్తున్నారు. ఈ డబ్బులు ఎప్పుడు ఖాతాల్లో జమ అవుతాయోనని వెయిట్ చేస్తున్నారు. అయితే తాజాగా మరో గుడ్‌న్యూస్ తెరపైకి వస్తోంది. రూ.6 వేల సాయాన్ని కేంద్ర ప్రభుత్వం రూ.8 వేలకు పెంచే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై పూర్తిస్థాయిలో సన్నాహాలు చేస్తుండగా.. ఇంకా అధికారిక సమాచారం లేదు. పీఎం కిసాన్ మొత్తాన్ని రూ.6 వేల నుంచి రూ.8 వేలకు పెంచితే.. ప్రతి 3 నెలలకు ఒకసారి రైతులకు రూ.2 వేలు విడతగా అందజేస్తారు. ప్రస్తుతం 4 నెలలకు రూ.2 వేలు పొందుతున్నారు. 

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 2019లో మోదీ సర్కారు ప్రారంభించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా దాదాపు 2 కోట్ల 63 లక్షల మంది ఈ పథకం కింద లబ్ధిపొందారు. అయితే వీరిలో చాలా మంది ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నావారు.. ట్యాక్స్ పేయర్లు ఉండడం.. ఇతర కారణాల వల్ల చాలా మందిని అనర్హులుగా ప్రకటించారు. ప్రస్తుతం ఈ స్కీమ్‌ కింద అర్హులుగా గుర్తించేందుకు నగదు జమ చేసేందుకు ముందు.. ఈకేవైసీ తప్పనిసరి చేశారు. వారి భూమి రికార్డులను పరిశీలించడంతోపాటు బ్యాంక్ అకౌంట్లను ఆధార్‌తో లింక్ చేయించారు. 

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 15వ విడత నిధులు త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. అంతకంటే ముందే రైతులు ఈకేవైసీని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈకేవైసీ కంప్లీట్ చేయకపోతే లబ్ధిదారులకు నగదు జమ అవ్వదు. కొత్తగా రైతులు దరఖాస్తు చేసుకోవాలనేవారు ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి

==> ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://PMkisan.gov.in/ కి వెళ్లండి
==> ఇక్కడ కొత్త రైతు నమోదు ఆప్షన్‌పై క్లిక్ చేయండి
==> తరువాత దరఖాస్తు చేయడానికి భాషను ఎంచుకోండి. 
==> మీరు పట్టణ ప్రాంతంలోని రైతు అయితే.. అర్బన్ ఫార్మర్ రిజిస్ట్రేషన్‌ని ఎంచుకోండి. 
==> మీరు గ్రామీణులైతే గ్రామీణ రైతు రిజిస్ట్రేషన్‌ని ఎంచుకోండి. 
==> ఆధార్ నంబర్, ఫోన్ నంబర్, రాష్ట్రం ఎంచుకోండి. 
==> మీ భూమి వివరాలను ఎంటర్ చేయండి
==> మీ డాక్యుమెంట్స్‌ను అప్‌లోడ్ చేసి.. సేవ్ బటన్‌పై క్లిక్ చేయండి. 
==> క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ OTPకి వెళ్లి సబ్మిట్ చేయండి.
==> మీ మొబైల్ నంబరుకు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి.. రిజిస్ట్రేషన్ చేసుకోండి.

Also Read: IND Vs AFG Dream11 Prediction Today Match: ఆఫ్ఘన్‌తో భారత్ పోరు.. పిచ్ రిపోర్ట్, డ్రీమ్11 టీమ్ టిప్స్ మీ కోసం..  

Also Read: Jio Best Recharge Plan: ఇది కదా కావాల్సింది.. బెస్ట్ జియో రీఛార్జ్ ప్లాన్ ఇదే.. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News