IND Vs AUS Dream11 Team Today Prediction: వరల్డ్‌కప్‌కు ముందు చివరి ఫైట్.. భారత్ వైట్‌వాష్ చేస్తుందా..? డ్రీమ్11 టీమ్, పిచ్ రిపోర్ట్ ఇలా..

India Vs Australia Pitch Report and Dream11 Team Top Pics: తొలి రెండు వన్డేల్లో ఆసీస్‌ను చిత్తుగా ఓడించిన భారత్.. అదే ఊపులో మూడో వన్డేలోనూ విజయం సాధించి సిరీస్‌ను వైట్‌వాష్ చేయాలని చూస్తోంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, కోహ్లీ, బుమ్రా, కుల్దీప్ యాదవ్, సిరాజ్ ఈ మ్యాచ్‌లో ఆడనున్నారు.   

Written by - Ashok Krindinti | Last Updated : Sep 27, 2023, 11:48 AM IST
IND Vs AUS Dream11 Team Today Prediction: వరల్డ్‌కప్‌కు ముందు చివరి ఫైట్.. భారత్ వైట్‌వాష్ చేస్తుందా..? డ్రీమ్11 టీమ్, పిచ్ రిపోర్ట్ ఇలా..

India Vs Australia Pitch Report and Dream11 Team Top Pics: ప్రపంచకప్‌ ముందు టీమిండియా చివరి పోరుకు రెడీ అయింది. ఆస్ట్రేలియాపై ఇప్పటికే 2-0 తేడాతో వన్డే సిరీస్‌ సొంతం చేసుకున్న భారత్.. చివరి వన్డేలోనూ ఓడించి క్లీన్‌స్వీప్ చేయాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, సిరాజ్ జట్టులోకి రానున్నారు. హార్థిక్ పాండ్యాతో పాటు ఓపెనర్ శుభ్‌మన్ గిల్, మహ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ తుది జట్టుకు దూరమయ్యారు. వరుస మ్యాచ్‌ల్లో విజయాలతో భారత్ జోష్‌లో ఉండగా.. ప్రపంచకప్‌కు ముందు దక్షిణాఫ్రికా, టీమిండియా చేతిలో సిరీస్‌ ఓటములు ఆసీస్‌ అభిమానులను నిరాశకు గురిచేస్తున్నాయి. చివరి మ్యాచ్‌లో అయినా గెలిచి ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకోవాలని ఆసీస్ భావిస్తోంది. గ్లెన్ మాక్స్‌వెల్, మిచెల్ స్టార్క్ ఈ వన్డేలో ఆడనున్నారు. రాజ్‌కోట్ వేదికగా బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కానుంది. రెండు జట్ల ప్లేయింగ్11 ఎలా ఉంటుంది..? పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుంది..? డ్రీమ్11 టీమ్ టిప్స్ ఇలా..

పిచ్ రిపోర్ట్ ఇలా..

రాజ్‌కోట్ పిచ్ కూడా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. మ్యాచ్‌ మొత్తం పరుగుల వరద పారనుంది. ప్రారంభంలో పేసర్లకు తక్కువ సహాయం అందుతుంది. ఈ ట్రాక్‌లో స్పిన్నర్లు ఇక్కడ వికెట్ల కోసం తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. ఈ వికెట్‌పై సగటు తొలి ఇన్నింగ్స్ స్కోరు 310 పరుగులుగా ఉంది. ఇక్కడ రెండో బ్యాటింగ్‌ చేసిన జట్టుకు మంచి రికార్డులు లేవు. ఈ పిచ్‌పై మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 60 శాతం విజయం సాధించగా.. ఛేజింగ్ జట్టు 40 శాతం విజయాలు సాధించాయి. 

స్ట్రీమింగ్ వివరాలు ఇలా..

==> వేదిక: రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌ స్టేడియం
==> సమయం: మధ్యాహ్నం 1.30 గంటలకు నుంచి ప్రారంభం
==> స్ట్రీమింగ్ వివరాలు: స్పోర్ట్స్ 18 ఛానెల్స్ Sports18 1 SD, Sports18 1 HD ఛానెల్స్‌తోపాటు జియో సినిమా యాప్‌లో లైవ్ స్ట్రీమింగ్ ఫ్రీగా చూడొచ్చు.

రెండు జట్ల ప్లేయింగ్11 ఇలా.. (అంచనా)

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా

ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబూషేన్‌, అలెక్స్ కారీ, గ్లెన్ మాక్స్‌వెల్, పాట్ కమిన్స్ (కెప్టెన్), కామెరూన్ గ్రీన్, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్, ఆడమ్ జంపా, సీన్ అబాట్
 
డ్రీమ్ 11 టీమ్ ఇలా..

వికెట్ కీపర్లు: కేఎల్ రాహుల్

బ్యాట్స్‌మెన్లు: రోహిత్ శర్మ (కెప్టెన్), డేవిడ్ వార్నర్ (వైస్ కెప్టెన్), స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్

ఆల్ రౌండర్లు: రవీంద్ర జడేజా, గ్లెన్ మాక్స్‌వెల్

బౌలర్లు: జస్ప్రీత్ బుమ్రా, మిచెట్ స్టార్క్, రవిచంద్రన్ అశ్విన్.

Also Read: Chandrababu Case Updates: క్వాష్ పిటీషన్‌పై చంద్రబాబుకు ఊరట, రేపు విచారణకు లిస్టింగ్

Also Read: Oppo Reno 10 5G Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో OPPO Reno10 5G మొబైల్‌పై స్పెషల్‌ డీల్‌..రూ. 9,900కే పొందండి..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News