తొలి టెస్టులో భారత్ ఘన విజయం

తొలి టెస్టులో భారత్ ఘన విజయం

Updated: Nov 16, 2019, 04:45 PM IST
తొలి టెస్టులో భారత్ ఘన విజయం
Image Credits: Reuters

ఇండోర్: బంగ్లాదేశ్‌లో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఆలౌ రౌండ్ పర్‌ఫార్మెన్స్ కనబర్చడంతో ఒక ఇన్నింగ్స్, 130 పరుగులతో కోహ్లీ సేన ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 213 పరుగులకే చాపచుట్టేయడంతో 130 పరుగులతో భారత జట్టు గెలిచింది. బంగ్లా ఆటగాళ్లలో ముష్పీకర్ రహీమ్(64) ఒంటరి పోరాటం చేసేందుకు ప్రయత్నించినప్పటికీ అశ్విన్‌ బౌలింగ్‌లో పుజారాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టకతప్పలేదు. అంతకంటే ముందు లిటన్ దాస్(35), హసన్(38) కాసేపు ముష్ఫికర్ రహీమ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేసినప్పటికీ.. రహీమ్ ఔట్ అయిన తర్వాత మిగిలిన బ్యాట్స్‌మెన్లు అందరూ ఒక్కొక్కరిగా పెవిలియన్ క్యూ కట్టడంతో బంగ్లాకు ఓటమి తప్పలేదు. 

భారత బౌలర్లలో మహ్మద్ షమి 4 వికెట్లు, అశ్విన్ 3 వికెట్లతో రాణించగా ఉమేశ్ యాదవ్ 2 వికెట్లు, ఇషాంత్ శర్మ ఒక వికెట్ తీశారు.