India vs Australia 3rd Test: ఆస్ట్రేలియా గడ్డపై తొలి టెస్టులో ఓటమికి రెండో టెస్టు విజయంతో టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ లాంటి స్టార్ ప్లేయర్లు లేకున్నా అజింక్య రహానే కెప్టెన్సీలో మెల్‌బోర్న్ టెస్టులో భారత జట్టు అద్భుతం చేసింది. అయితే ఆసీస్ జట్టు తమ లోపాలను సరిదిద్దుకునే చర్యలు చేపట్టినట్లు కనిపిస్తోంది.
రెండు టెస్టులలో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేని ఆటగాళ్లను మిగతా రెండు టెస్టులకు దూరం చేయనుంది. ముఖ్యంగా అడిలైడ్, మెల్‌బోర్న్ బాక్సింగ్ టెస్టుల్లో నిరాశపరిచిన ఓపెనర్ జో బర్న్స్‌పై వేటు వేసింది. రెగ్యూలర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్(David Warner)ను ఎంపిక చేసింది. గాయాలతో తొలి రెండు టెస్టులకు దూరమైన కీలక ఆటగాడు వార్నర్‌తో పాటు విల్ పకోస్కీ, సీన్ అబాట్‌లను తర్వాతి రెండు టెస్టులకు క్రికెట్ ఆస్ట్రేలియా మేనేజ్‌మెంట్ ఎంపిక చేయడం గమనార్హం.
Also Read: Ravichandran Ashwin: ప్రపంచ రికార్డు నెలకొల్పిన టీమిండియా బౌలర్
తొలి రెండు టెస్టుల్లో 8, 51, 0, 4 పరుగులతో జో బర్న్స్ ఘోరంగా విఫలమయ్యాడు. అదే సమయంలో స్టార్ ఆటగాడు, ఓపెనర్ వార్నర్ కోలుకోవడం ఆసీస్‌కు శుభపరిణామం. అదే సమయంలో సీన్ అబాట్ ఫిట్‌నెస్ నిరూపించుకోవడంతో చివరి రెండు టెస్టులకు ఎంపిక చేశారు. మరో ఆటగాడు విల్ పకోస్కికి కంకషన్ లక్షణాలు లేవని, అంతా ఓకేనని చెప్పడంతో అవకాశం ఇవ్వనున్నారు.
Also Read: AUS v IND 2nd Test Highlights: ఆస్ట్రేలియా జట్టుకు డబుల్ షాకిచ్చిన ICC
కాగా, కీలకమైన మూడో టెస్టు సిడ్నీ వేదికగా జనవరి 7న ప్రారంభం కానుంది. నూతన సంవత్సర వేడుకలతో పాటు మరిన్ని కారణాలతో మూడో టెస్టుకు ఇరు జట్ల ఆటగాళ్లకు భారీగా విశ్రాంతి లభించింది. వార్నర్, విల్ పకోస్కీ సిడ్నీ టెస్టులో ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. నాలుగు టెస్టుల సిరీస్‌లో తొలి టెస్టు ఆసీస్ నెగ్గగా, బాక్సింగ్ డే టెస్టులో భారత్(Team India) విజయదుందుబి మోగించి 1-1తో సమం చేసింది.
Also Read: Tamil Nadu: బీజేపీలో చేరిన టీమిండియా మాజీ క్రికెటర్, ఖుష్బూ స్నేహితుడు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook