India vs Australia Ravichandran Ashwin: టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో స్టార్ బౌలర్ అశ్విన్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. టెస్టుల్లో అత్యధిక మంది లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ వికెట్లు తీసిన బౌలర్‌గా అశ్విన్ నిలిచాడు. ఆసీస్‌తో జరిగిన మెల్‌బోర్న్ టెస్టులో ఈ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇప్పటివరకూ ఈ రికార్డు శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ పేరిట ఉండేది. 192వ వికెట్‌ను సాధించడంతో మురళీధరన్ పేరిట ఉన్న ఈ అరుదైన రికార్డు బద్దలైంది. లంక స్పిన్నర్ ఎడం చేతి వాటం బ్యాట్స్‌మెన్ 191 వికెట్లు తన ఖాతాలో వేసుకోగా.. ఆసీస్ బ్యాట్స్‌మెన్ హజెల్‌వుడ్‌ను ఔట్ చేయడం ద్వారా తాజాగా ఆ రికార్డును భారత (Team India) స్పిన్నర్ అశ్విన్ అధిగమించాడు. ఓవరాల్‌గా టెస్టుల్లో అశ్విన్ మొత్తం 375 వికెట్లు పడగొట్టాడు.
Also Read: AUS v IND 2nd Test Highlights: ఆస్ట్రేలియా జట్టుకు డబుల్ షాకిచ్చిన ICC
భారత స్టార్ ఆఫ్ స్పిన్నర్ అశ్విన్(Ravichandran Ashwin) టెస్ట్ కెరీర్‌లో ఇప్పటివరకూ పడగొట్టిన వికెట్లలో సగానికి పైగా లెఫ్ట్ హ్యాండర్స్‌వే ఉండటం గమనార్హం. అంటే లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ పాలిట అశ్విన్ సింహస్వప్నం అని చెప్పవచ్చు. 700, 800 టెస్టు వికెట్లు సాధించిన మురళీధరన్, షేన్‌వార్న్ లాంటి బౌలర్లను సైతం ఈ విషయంలో అశ్విన్ అధిగమించడం విశేషం.
Also Read: Tamil Nadu: బీజేపీలో చేరిన టీమిండియా మాజీ క్రికెటర్, ఖుష్బూ స్నేహితుడు
లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ వికెట్లు అత్యధికంగా తీసిన టాప్ బౌలర్లు వీరే..
రవిచంద్రన్ అశ్విన్ 192 వికెట్లు
ముత్తయ్య మురళీధరన్ 191 వికెట్లు
జేమ్స్ అండర్సన్ 186 వికెట్లు
గ్లెన్ మెక్‌గ్రాత్ 172 వికెట్లు
షేన్ వార్న్ 172 వికెట్లు
అనిల్ కుంబ్లే 167 వికెట్లు
Also Read: MS Dhoniకి అత్యంత అరుదైన పురస్కారం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook