India Vs Australia WTC Final 2023: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడేందుకు టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు రెడీ అయ్యాయి. ఈ నెల 7వ తేదీ నుంచి ఇంగ్లాండ్‌లోని ఓవల్ వేదికగా రెండు జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే ఇరు జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో మునిగిపోయారు. గత డబ్ల్యూటీసీ ఫైనల్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలైన భారత్.. ఈసారి ఎలాగైనా కప్ కొట్టాలని కసితో ఉంది. రెండు జట్లు బలంగా ఉండడంతో పోరు ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంటుంది. ఇక ఈ మ్యాచ్‌లో నుంచి కొత్త రూల్స్ అమలుకానున్నాయి. ఐసీసీ మూడు కీలక మార్పులు చేసింది. అవేంటో తెలుసుకోండి.
ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అంపైర్ సాఫ్ట్ సిగ్నల్‌పై ఎప్పుడూ చర్చ జరగుతుంటుంది. ఆటగాళ్లతో పాటు క్రికెట్ ఫ్యాన్స్, మాజీ ఆటగాళ్లు సాఫ్ట్ సిగ్నల్స్‌పై భిన్న అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇప్పుడు సాఫ్ట్ సిగ్నల్స్‌కు సంబంధించిన నిబంధనలు మారనున్నాయి. ఇక నుంచి ఆన్‌ఫీల్డ్ అంపైర్‌లు.. తమ నిర్ణయాన్ని థర్డ్ అంపైర్‌కు నివేదించడానికి సాఫ్ట్ సిగ్నల్ అవసరం లేదు.
ఇది కాకుండా ఐసీసీ మరో కీలక మార్పు చేసింది. అంతర్జాతీయ క్రికెట్‌లో హెల్మెట్ భద్రతను తప్పనిసరి చేశారు. ప్రత్యేక పరిస్థితుల కోసం ఈ నిబంధన అమలు చేయనున్నారు. జూన్ 1 నుంచి జరిగే అంతర్జాతీయ మ్యాచ్‌లకు ప్రమాదకర పరిస్థితుల్లో హెల్మెట్ ధరించడాన్ని ఐసీసీ తప్పనిసరి చేసింది.
ఐసీసీ కొత్త నిబంధనలు..
==> ఫాస్ట్ బౌలింగ్ ఎదుర్కొనే సమయంలో బ్యాట్స్‌మెన్ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి.
==> పేసర్లు బౌలింగ్ చేస్తున్న సమయంలో వికెట్ కీపర్ కచ్చితంగా హెల్మెట్ ధరించాల్సిందే.
==> బ్యాట్స్‌మెన్‌కు దగ్గరలో ఫీల్డింగ్ చేసే ప్లేయర్లు హెల్మెట్ ధరించడం తప్పనిసరి.
Also Read: Newly Married Couple Death: శోభనం గదిలో నవదంపతులు మృతి.. అసలు ఏమైందంటే..?
రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా బరిలోకి దిగుతోంది. స్వదేశంలో ఆస్ట్రేలియాను 2-1 తేడాతో ఓడించి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత్ అర్హత సాధించింది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు కొందరు కీలక ఆటగాళ్లు దూరమవ్వడం ఇబ్బంది పెడుతోంది. కేఎల్ రాహుల్, బూమ్రా, రిషభ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ వంటి స్టార్లు దూరమయ్యారు. అయినా భారత్ పటిష్టంగానే ఉంది. ఓపెనింగ్‌లో శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సీనియర్ ప్లేయర్ అజింక్యా రహానేపై భారీ ఆశలు ఉన్నాయి. బౌలింగ్‌లో షమీ, సిరాజ్ ఫాస్ట్ పిచ్‌లపై ప్రభావం చూపించే అవకాశం ఉంది.
Also Read: ENG Vs IRE: బ్యాట్ టచ్ చేయకుండా.. బాల్ ముట్టకుండా.. బెన్ స్టోక్స్ అరుదైన రికార్డు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి