Newly Married Couple Death: శోభనం గదిలో నవదంపతులు మృతి.. అసలు ఏమైందంటే..?

Married Couple Died On First Night: కోటి ఆశలతో కొత్త జీవితం ఆరంభిద్దామని అనుకున్న నవ దంపతులు.. ఊహించని రీతిలో మృతి చెందారు. ఫస్ట్ నైట్ రోజే గుండెపోటుతో మృతి చెందారు. దీంతో పెళ్లింట విషాదఛాయలు అలముకున్నాయి.  

Written by - Ashok Krindinti | Last Updated : Jun 5, 2023, 09:14 AM IST
Newly Married Couple Death: శోభనం గదిలో నవదంపతులు మృతి.. అసలు ఏమైందంటే..?

Married Couple Died On First Night: శోభనం గదిలో నవ దంపతులు మృతి చెందిన విషాద ఘటన ఉత్తర్‌ ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. పెళ్లి జరిగిన తరువాత రాత్రి మొదటి రాత్రికి ముహూర్తం ఫిక్స్ చేయగా.. వధూవరులు గదిలోకి వెళ్లారు. తెల్లారేసరికి ఇద్దరు విగత జీవులుగా మారారు. గుండెపోటుతో మరణించినట్లు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో తేలింది. నవ దంపతుల మరణంతో పెళ్లింట తీవ్ర విషాదం నెలకొంది. పూర్తి వివరాలు ఇలా..

బహ్రైచ్ జిల్లా కైసర్‌గంజ్ పీఎస్ పరిధిలోని గోధియా గ్రామానికి చెందిన ప్రతాప్‌ యాదవ్‌ (24), పుష్ప (22) వివాహం మంగళవారం జరిగింది. బుధవారం రాత్రి శోభనం కోసం పెద్దలు ముహూర్తం ఖరారు చేశారు. రాత్రి వధూవరులు గదిలోకి వెళ్లి.. తలుపులు వేసుకుని గడియ పెట్టుకున్నారు. ఉదయం నిద్ర లేపేందుకు తలుపులు తట్టగా.. ఎంతసేపటికి తీయలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు తలుపులు బద్దలు కొట్టగా.. మంచంపై ఇద్దరు విగత జీవులుగా పడిపోయి ఉన్నారు.

ఏం జరిగిందోనని తెలియక కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బహ్రైచ్ జిల్లా ఎస్పీ ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. దంపతుల మృతికి గుండె పోటు కారణమని పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో వెల్లడైందన్నారు. అయితే గతంలో వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు గానీ.. గుండె సంబంధిత సమస్యలు గానీ లేవన్నారు. మరింత సమాచారం కోసం లక్నోలోని స్టేట్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి తరలించినట్లు తెలిపారు.

Also Read: Bihar Bridge Collapse: నిర్మాణంలోనే గంగా నదిలో కుప్పకూలిన బ్రిడ్జి.. వీడియోలు వైరల్  

స్థానిక పోలీసులు మాట్లాడుతూ.. వధూవరులు నిద్రపోయిన గదిలో వెంటిలేషన్ లేదని చెబుతున్నారు. ఊపిరాడక కార్డియాక్ అరెస్ట్‌కు గురై ఉంటారని అంటున్నారు. వివాహం జరిగిన మరుసటి రోజే.. నవ దంపతులు మరణించడం స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి. ఇద్దరి మృతదేహాలకు ఒకేచోట దహన సంస్కారాలు పూర్తి చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: ENG Vs IRE: బ్యాట్ టచ్ చేయకుండా.. బాల్ ముట్టకుండా.. బెన్ స్టోక్స్ అరుదైన రికార్డు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News