R Ashwin: టీమిండియా స్టార్ స్పిన్నర్ అశ్విన్ ఖాతాలో అరుదైన రికార్డు

India vs England 3rd Test Live Score Updates: నరేంద్ర మోదీలో ఇంగ్లాండ్, టీమిండియా జట్ల మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో అత్యల్ప స్కోర్ల పరంపంర కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో అశ్విన్ ఈ అరుదైన రికార్డును నమోదు చేశాడు.

Written by - Shankar Dukanam | Last Updated : Feb 25, 2021, 07:19 PM IST
  • టీమిండియా స్టార్ స్పిన్నర్ అశ్విన్ ఖాతాలో అరుదైన రికార్డు
  • మోతెరాలో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో అత్యల్ప స్కోర్ల పరంపంర
  • టెస్టుల్లో 400 వికెట్లు పడగొట్టిన నాలుగో భారత బౌలర్‌గా అశ్విన్
R Ashwin: టీమిండియా స్టార్ స్పిన్నర్ అశ్విన్ ఖాతాలో అరుదైన రికార్డు

India vs England 3rd Test Live Score Updates: అతిపెద్ద స్టేడియం మోతెరాలో ఇంగ్లాండ్, టీమిండియా జట్ల మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో అత్యల్ప స్కోర్ల పరంపంర కొనసాగుతోంది. డే అండ్ నైట్ టెస్టులో తొలుత టీమిండియా బౌలర్లు రాణించి ఇంగ్లాండ్‌ను 112 పరుగులకే ఆలౌట్ చేయగా, భారత్ సైతం తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప ఆధిక్యానికే ఆలౌట్ అయింది.

రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లాండ్‌ను టీమిండియా స్పిన్నర్లు నియంత్రించారు. ఈ క్రమంలో స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) అరుదైన జాబితాలో చేరిపోయాడు. టెస్టుల్లో 400 వికెట్లు పడగొట్టిన నాలుగో భారత బౌలర్‌గా నిలిచాడు. ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో అశ్విన్ ఈ అరుదైన రికార్డును నమోదు చేశాడు. ఆ సమయానికి ఇంగ్లాండ్ స్కోరు 68/7.

Also Read: Martin Guptill వీర విహారం, Rohit Sharma అత్యధిక సిక్సర్ల రికార్డు బద్ధలు

ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లోనూ 5 వికెట్ల ఇన్నింగ్స్‌తో టీమిండియా(Team India) స్పిన్నర్ అక్షర్ పటేల్ చెలరేగడంతో పర్యాటక జట్టు రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 81 పరుగులకే కుప్పకూలింది. వాషింగ్టన్ బంతి అందుకున్న వెంటనే ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్‌ను డకౌట్‌గా పెవిలియన్ బాట పట్టించాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ త్వరగా ఆలౌట్ అయింది. 

Also Read: Sachin Tendulkar: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ FREE Cricket సెషన్స్, యువ ఆటగాళ్లకు సలహాలు, సూచనలు

కెరీర్‌లో రెండు టెస్టు ఆడుతున్నప్పటికీ తన డొమెస్టిక్ అనుభవంతో లోకల్ బౌలర్ అక్షర్ పటేల్ మూడో టెస్టులో ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. తద్వారా ప్రపంచంలోనే అతిపెద్దదైన నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న టెస్టులో కేవలం రెండు రోజుల్లోనే కథ ముగిసేలా ఉంది. ఇదివరకే ఇంగ్లాండ్ ఆటగాళ్లు పిచ్ ఏర్పాటుపై పెదవి విరుస్తున్నారు. అయితే టీమిండియా సైతం ఈ వికెట్‌పై స్వల్ప స్కోరుకు ఆలౌట్ కావడం తెలసిందే.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

More Stories

Trending News