India vs England Semi Final Dream11 prediction of T20 World Cup 2022: ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2022 సూపర్ 12లో అద్భుత ప్రదర్శన చేసి.. గ్రూప్ 2 టాపర్ హోదాలో భారత్ సెమీస్ చేరింది. అడిలైడ్ వేదికగా గురువారం (నవంబరు 10) మధ్యాహ్నం జరుగనున్న రెండో సెమీ ఫైనల్లో ఫైనల్ బెర్త్ కోసం ఇంగ్లండ్‌తో అమితుమీ తేల్చుకోనుంది. భారత్, ఇంగ్లండ్ జట్లు బ్యాటిగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా ఉన్న నేపథ్యంలో ఈ మ్యాచ్ హోరాహోరీ సాగే అవకాశాలు ఉన్నాయి.
సెమీస్ మ్యాచులో ఓపెనర్లుగా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ బరిలోకి దిగనున్నారు. రాహుల్ ఫామ్ అందుకున్నా.. రోహిత్ బ్యాట్ జులిపించాల్సిన అవసరం ఉంది. విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ సూపర్ ఫామ్‌లో ఉందాం కలిసొచ్చే అంశం. హార్దిక్ పాండ్యా బ్యాట్ ఝులిపించాల్సి సమయం ఆసన్నమైంది. వరుసగా విఫలమవుతున్న దినేశ్ కార్తీక్ సెమీ ఫైనల్లో ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. డీకే స్థానంలో రిషబ్ పంత్ ఆడనున్నాడు. అడిలైడ్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో అక్షర్ పటేల్ స్థానంలో యుజ్వేంద్ర చహల్ ఆడతాడేమో చూడాలి. ఆర్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్ కోటాలో ఆడుతారు.
సెమీ ఫైనల్ మ్యాచుకు ముందు ఇంగ్లండ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ బ్యాటర్ డేవిడ్ మలన్ గాయం కారణంగా టీమిండియాతో మ్యాచ్‌కు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మలన్ స్థానంలో ఫిల్ సాల్ట్ ఆడనుం ఆడనున్నాడు. మార్క్ వుడ్ కూడా ఫిట్ నెస్ సమస్యలు ఎదుర్కొంటున్నాడు. మలన్, వుడ్ దూరమయినా ఇంగ్లీష్ జట్టు పటిష్టంగానే ఉంది. అలెక్స్ హేల్స్, జోస్ బట్లర్, బెన్ స్టోక్స్, మోయిన్ అలీ, లియామ్ లివింగ్‌స్టోన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్ లాంటి స్టార్ ప్లేయర్స్ ఉన్నారు.
తుది జట్లు (అంచనా):
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్/దినేశ్ కార్తీక్, ఆర్ అశ్విన్, అక్షర్ పటేల్/యుజ్వేంద్ర చహల్, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్.
ఇంగ్లండ్: జోస్ బట్లర్ (కెప్టెన్), అలెక్స్ హేల్స్, డేవిడ్ మలన్/ ఫిల్ సాల్ట్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, మోయిన్ అలీ, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రాన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.
డ్రీమ్ ఎలెవన్ టీమ్:
జోస్ బట్లర్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), మొయిన్ అలీ, హార్దిక్ పాండ్యా, లియామ్ లివింగ్‌స్టోన్, బెన్ స్టోక్స్ (వైస్ కెప్టెన్), మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, మార్క్ వుడ్, ఆదిల్ రషీద్.
Also Read: IND vs PAK: భారత్ vs పాకిస్తాన్ మధ్య ఫైనల్ మ్యాచ్‌ను జరగనివ్వం.. వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాం!
Also Read: IND vs ENG: డేవిడ్ మలన్ ఔట్.. సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేసిన ఇంగ్లండ్! టీమిండియాకు చుక్కలే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి