వరల్డ్‌కప్‌‌‌కి వెళ్లే భారతీయ అంపైర్లు వీరే..!

జనవరి 13 నుంచి న్యూజిలాండ్‌లో జరగనున్న అండర్‌-19 ప్రపంచకప్‌ పోటీలలో విధులు నిర్వర్తించే అంపైర్ల జాబితాలో పలువురు భారతీయులు కూడా ఉండడం విశేషం. 

Last Updated : Jan 3, 2018, 05:55 PM IST
 వరల్డ్‌కప్‌‌‌కి వెళ్లే భారతీయ అంపైర్లు వీరే..!

జనవరి 13 నుంచి న్యూజిలాండ్‌లో జరగనున్న అండర్‌-19 ప్రపంచకప్‌ పోటీలలో విధులు నిర్వర్తించే అంపైర్ల జాబితాలో పలువురు భారతీయులు కూడా ఉండడం విశేషం. భారత అంపైర్లు అనిల్‌ చౌదరి, సీకే నందన్‌లు కూడా ఈ పోటీలలో అంపైర్లుగా విధులు నిర్వర్తించనున్నారు. అనిల్‌ చౌదరి ఇటీవల భారత్‌-శ్రీలంక మధ్య జరిగిన సిరీస్‌కు మ్యాచ్‌ రిఫరీగా వ్యవహరించారు.

వీరితో పాటు రాబర్ట్‌ బైలీ (ఇంగ్లాండ్), బ్రాత్‌వైట్ (బార్బడోస్)‌, నిగెల్‌ దుగుడ్ (వెస్టీండీస్)‌, షాన్‌ జార్జ్ (దక్షిణాఫ్రికా), షాన్‌ హైగ్ (న్యూజిలాండ్)‌, మార్క్‌ హాత్రోన్ (ఐర్లాండ్)‌, డేవిడ్‌ మార్టినిస్‌, ఆసన్‌ రాజాటిమ్ (పాకిస్తాన్), రాబిన్‌సన్ (ఇంగ్లాండ్)‌ మొదలైనవారు కూడా ఈ ప్రపంచకప్ పోటీల్లో అంపైర్లుగా విధులు నిర్వర్తించనున్నారు. ఈ టోర్నీలో తొలి మ్యాచ్‌ న్యూజిలాండ్‌-వెస్టిండీస్‌ మధ్య జరగనుంది.అదేవిధంగా, ఈ టోర్నీలో భారత్‌ తొలి మ్యాచ్‌ను జనవరి 14న ఆసీస్‌తో ఆడనుంది. భారత్ జట్టుకి రాహుల్ ద్రావిడ్ కోచ్‌గా వ్యవహరించనున్నారు.

Trending News