David Warner: డేవిడ్ వార్నర్ ఔట్.. గుక్కపట్టి ఏడ్చిన దేవ్ భాయ్ కూతురు (వీడియో)

IPL 2022, DC vs RCB: David Warner daughters crying. వానిందు హసరంగ వేసిన 12వ ఓవర్ మూడో బంతికి డేవిడ్‌ వార్నర్‌ ఔట్ అయ్యాడు. వార్నర్ ఔటవ్వగానే మైదానంలో ఉన్న అతడి ఇద్దరు కూతుళ్లు ఏడ్చేశారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 20, 2022, 11:49 PM IST
  • డేవిడ్‌ వార్నర్‌ ఔట్
  • గుక్కపట్టి ఏడ్చిన దేవ్ భాయ్ కూతురు
  • అభిమానులకు టచ్‌లోనే దేవ్ భాయ్
David Warner: డేవిడ్ వార్నర్ ఔట్.. గుక్కపట్టి ఏడ్చిన దేవ్ భాయ్ కూతురు (వీడియో)

David Warner daughters crying after his dismissal against RCB: ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్‌ వార్నర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మైదానంలోకి దిగితే పరుగుల వరద పారాల్సిందే. ఎంతటి మేటి బౌలర్ అయినా సరే.. దేవ్ భాయ్ ముందు తలొగ్గక తప్పదు. అయితే వార్నర్ తన ఆటతోనే కాదు.. డాన్స్‌, డైలాగులు చెపుతూ అందరినీ ఆకట్టుకుంటాడు. కరోనా లాక్‌డౌన్ సందర్భంగా ఇంట్లోనే ఉన్న వార్నర్.. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తెలుగు, హిందీ పాటలకు స్టెప్పులేసి అభిమానులకు టచ్‌లోనే ఉన్నాడు. ఇలా ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకునే వార్నర్.. తాజాగా తన కూతుళ్లకు సంబందించిన ఓ విషయాన్ని పంచుకున్నాడు. 

ఐపీఎల్‌ 2022లో డేవిడ్‌ వార్నర్‌ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆడుతున్న సంగతి తెలిసిందే. శనివారం రాత్రి వాంఖడే మైదానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 16 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆర్‌సీబీ నిర్ధేశించిన 190 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 173 పరుగులే చేసి ఓడిపోయింది. ఈ మ్యాచులో వార్నర్‌ (66) హాఫ్ సెంచరీతో రాణించాడు. వరుసగా రెండో అర్థ సెంచరీ సాధించి ఢిల్లీ జట్టును గెలిపించేలా కనిపించాడు. 

వానిందు హసరంగ వేసిన 12వ ఓవర్ మూడో బంతికి డేవిడ్‌ వార్నర్‌ ఔట్ అయ్యాడు. వార్నర్ ఔటవ్వగానే మైదానంలో ఉన్న అతడి ఇద్దరు కూతుళ్లు ఏడ్చేశారు. పెద్ద కూతురు ఇవీ మే గుక్కపట్టి ఏడ్వగా.. ఇండీ రే మాత్రం తన భాదను బయటపడమీయలేదు. ఇందుకు సంబందించిన ఫొటోను వార్నర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. 'నా ఇద్దరు కూతుర్లకు క్రికెట్ అంటే ఏంటో ఇష్టం. ఇద్దరికీ ఆటపై అవగాహన ఉంది. నేను ఔట్‌ అయ్యానన్న విషయాన్ని జీర్ణించుకోలేపోయారు. ఇలాంటి కూతుర్లు ఉండడం నా అదృష్టం. ప్రతీసారి మనమే గెలవలేము. మైదానంలో అడుగుపెట్టేముందు మ్యాచ్‌లో వంద శాతం ఎఫర్ట్‌ చూపించాలనుకుంటాం. ఒకసారి బాగా ఆడతాం ఇంకోసారి అది సాధ్యం కాదు. ఈ విషయాన్ని నా కూతుర్లకు చెప్పాలి' అని వార్నర్‌ పేర్కొన్నాడు. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by David Warner (@davidwarner31)

మరోవైపు ఐపీఎల్ 2022లో భాగంగా బుధవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ సునాయాస విజయం అందుకుంది. పంజాబ్ నిర్ధేశించిన 116 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ మరో 57 బంతులు ఉండగానే ఛేదించింది. డేవిడ్ వార్నర్ (60 నాటౌట్; 30 బంతుల్లో 10x4, 1x6) హాఫ్ సెంచరీ చేయగా.. పృథ్వీ షా (41; 20 బంతుల్లో 7x4, 1x6) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సీజన్లో ఢిల్లీ ఆరు మ్యాచులు ఆడి మూడు విజయాలు అందుకుంది. ఆరు పాయింట్లతో ప్రస్తుతం ఆరో స్థానంలో ఉంది. 

Also Read: DC vs PBKS: దంచికొట్టిన షా, వార్నర్.. పంజాబ్‌పై ఢిల్లీ సునాయాస విజయం!

Also Read: Number Plate: నువ్వు తోపు సామీ.. రూ. 71 వేల బండికి 15 లక్షల ఫ్యాన్సీ నంబర్‌! ట్విస్ట్ ఏంటంటే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News