IPL 2022: ఆ ఇద్దరు భారత ఆటగాళ్లు అప్పుడు తిట్టుకున్నారు.. ఇప్పుడు హాగ్ ఇచ్చుకున్నారు! అంతా ఐపీఎల్ మహిమ!!

Krunal Pandya hugs Deepak Hooda. దేశవాళీ క్రికెట్‌లో విభేదాల కారణంగా బద్ద శతృవులుగా మారిన భారత ఆటగాళ్లు కృనాల్ పాండ్యా, దీపక్ హుడాలు ఐపీఎల్ పుణ్యమాని ఒక్కటైపోయారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 29, 2022, 07:03 PM IST
  • అప్పుడు తిట్టుకున్నారు.. ఇప్పుడు హాగ్ ఇచ్చుకున్నారు
  • అంతా ఐపీఎల్ మహిమ
  • దీప‌క్ సంచలన ఆరోపణలు
IPL 2022: ఆ ఇద్దరు భారత ఆటగాళ్లు అప్పుడు తిట్టుకున్నారు.. ఇప్పుడు హాగ్ ఇచ్చుకున్నారు! అంతా ఐపీఎల్ మహిమ!!

Krunal Pandya hugs Deepak Hooda after Shubman Gill wicket: క్రీడలకు ఎంతో పవర్ ఉంటుంది. అసాధ్యంను కూడా సుసాధ్యం చేస్తాయి. మత విద్వేశాలు తగ్గించడమే కాకుండా.. పచ్చగడ్డివేస్తే భగ్గుమనే ఇద్దరు శత్రువులను కూడా కలుపుతాయి. ఇలాంటి ఘటనే తాజాగా ఐపీఎల్ 2022లో చోటుచేసుకుంది. దేశవాళీ క్రికెట్‌లో విభేదాల కారణంగా బద్ద శతృవులుగా మారిన భారత ఆటగాళ్లు కృనాల్ పాండ్యా, దీపక్ హుడాలు ఐపీఎల్ పుణ్యమాని ఒక్కటైపోయారు. లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడుతున్న ఈ ఇద్దరు.. సోమవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచులో హగ్ చేసుకున్నారు. 

2020లో దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ముందు కృనాల్ పాండ్యా, దీపక్ హుడా మధ్య అభిప్రాయ విబేధాలు వచ్చాయి. బరోడా టీమ్ కెప్టెన్ అయిన కృనాల్ కావాలనే త‌న‌పై నోరు పారేసుకున్నాడ‌ని.. టీమ్ స‌భ్యులు, ఇత‌ర టీమ్స్ ముందు త‌నను తిట్టాడని వైస్ కెప్టెన్ దీప‌క్ సంచలన ఆరోపణలు చేశాడు. ఆపై తాను బరోడా జట్టును వీడుతున్నట్లు ప్రకటించి పెద్ద వివాదానికి తెరదీశాడు. 

కృనాల్ పాండ్యా, దీపక్ హుడా గొడవ భారత క్రికెట్‌లో పెనుదుమారం సృష్టించింది. దాంతో బరోడా క్రికెట్ అసోసియేషన్ (బీసీఏ) విచారణ చేపట్టి దీపక్ హుడాదే తప్పు అని తేల్చి.. టీమ్ నుంచి కూడా సస్పెండ్ చేసింది. దాంతో హుడా 2020 సీజన్లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడలేదు. బరోడా టీమ్‌కు గుడ్‌బై చెప్పిన అతడు రాజస్థాన్ టీమ్ తరఫున బరిలోకి దిగాడు. రాజస్థాన్ తరఫున హుడా బాగా రాణించాడు. అప్పటి నుంచి ఈ ఇద్దరూ బద్ద శతృవులుగా మారారు. 

ఐపీఎల్ 2022 వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ ప్రాంచైజీ కృనాల్ పాండ్యా, దీపక్ హుడాలను కొనుగోలు చేసింది. హుడాను రూ.5.75 కోట్లకు తీసుకున్న లక్నో.. పాండ్యాను రూ.8.25 కోట్లకు దక్కించుకుంది. మిడిలార్డర్లో ఆడే ఈ ఇద్దరు క్రీజులో ఉండాల్సి వస్తే.. జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపే అవకాశం ఉందని అందరూ అనుకున్నారు. కానీ ఆడిన మొదటి మ్యాచ్‌లోనే హగ్ ఇచ్చుకుని అందరిని ఆశ్చర్యపరిచారు. గుజరాత్ ఓపెనర్ శుభమన్ గిల్ ఔటైన అనంతరం ఈ ఇద్దరూ ఒకరినొకరు హగ్ చేసుకున్నారు. బ్యాటింగ్ సమయంలో కూడా షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. దాంతో అందరూ సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం వీరి హగ్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. 

Also Read: Rashmika Mandanna Hot Photos: గ్లామర్ డోస్ పెంచిన రష్మిక.. ఎద అందాలు ఆరబోస్తూ..!!

Also Read: Rashmika Gym Workout: జిమ్‌లో తగ్గేదేలే అంటోన్న రష్మిక.. ఏందీ ఆ వర్కౌట్లు! వీడియో చూస్తే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News