SRH vs KKR: సన్‌రైజర్స్ హైదరాబాద్ హ్యాట్రిక్, కేకేఆర్‌పై 7 వికెట్లతో ఘన విజయం

SRH vs KKR: ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పుంజుకుంటోంది. వరుసగా 3వ విజయాన్ని నమోదు చేసింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 16, 2022, 06:37 AM IST
  • ఓటమితో ప్రారంభమై..హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసిన ఎస్ఆర్‌హెచ్
  • కేకేఆర్ జట్టుపై 7 వికెట్ల తేడాతో ఎస్ఆర్‌హెచ్ ఘన విజయం
  • ఐదు మ్యాచ్‌లలో మూడింట విజయంతో 6 పాయింట్లు
SRH vs KKR: సన్‌రైజర్స్ హైదరాబాద్ హ్యాట్రిక్, కేకేఆర్‌పై 7 వికెట్లతో ఘన విజయం

SRH vs KKR: ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పుంజుకుంటోంది. వరుసగా 3వ విజయాన్ని నమోదు చేసింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

ఐపీఎల్ 2022లో ప్రారంభంలోనే రెండు వరుస ఓటములు ఎదుర్కొన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అనంతరం కోలుకుంది. వరుసగా ఇప్పుడు మూడవ విజయాన్ని నమోదు చేసి సత్తా చాటుతోంది. కెప్టెన్ విలియమ్సన్ సారధ్యంలోని హైదరాబాద్ జట్టు నెమ్మదిగా పుంజుకుంటోంది. శుక్రవారం సాయంత్రం కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది.

తొలుత టాస్ గెలిచి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ రెండవ ఓవర్‌లోనే కోల్‌కతా వికెట్ల పతనం ప్రారంభమైంది. ఆరోన్ పింఛ్ 7 పరుగులే వెనుదిరిగాడు.  ఆ తరువాత కాస్సేపటికి మరో వికెట్ వెంకటేశ్ అయ్యర్ రూపంలో కోల్పోయింది. ఓ దశలో 72 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. అప్పటికే 11 ఓవర్లు ముగిశాయి. అయితే.. అక్కడి నుంచి నితీష్ రానా, రస్సెల్‌లు భారీ షాట్లు కొట్టడంతో కేకేఆర్ స్కోర్ పుంజుకుంది. 16 ఓవర్లు ముగిసేసరికి 122 పరుగులకు చేరుకుంది. ఈ క్రమంలో మిగిలిన నాలుగు ఓవర్లలో ఏకంగా 53 పరుగులు సాధించి..175 పరుగులకు చేరుకుంది. నితీష్ రాణా 76 పరుగులు చేయగా..రస్సెల్ 49 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 

ఇక ఆ తరువాత 176 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఎస్ఆర్‌హెచ్ జట్టుకు ప్రారంభంలోనే నిరాశ ఎదురైంది. ముందుగా అభిషేక్ శర్మ అవుట్ కాగా..కాస్సేపటికి కెప్టెన్ విలియమ్సన్ వెనుదిరిగాడు. రాహుల్ త్రిపాఠీ మర్‌క్రమ్ అద్భుత ప్రదర్శనతో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా మూడవ విజయాన్ని నమోదు చేసింది. 176 పరుగుల లక్ష్యాన్ని మరో 13 బంతులు మిగిలుండగానే అంటే 17.5 ఓవర్లలోనే పూర్తి చేసింది. రాహుల్ త్రిపాఠీ 71 పరుగులు చేయగా, మర్‌క్రమ్ 68 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 5 మ్యాచ్‌లు ఆడి మూడింట విజయం సాధించి 6 పాయింట్లు గెల్చుకుంది. అటు కేకేఆర్ 6 మ్యాచ్‌లు ఆడి..మూడింట విజయం సాధించి 6 పాయింట్లతో ఉంది. 

Also read: Sachin Tendulkar: ఆసక్తికరమైన దృశ్యం.. సచిన్ టెండూల్కర్ కాళ్లు మొక్కిన పంజాబ్‌ కోచ్‌ (వీడియో)!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News