IPL 2024 CSK vs RCB: మొదటి మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమికి కారణమేంటి

IPL 2024 CSK vs RCB: ఐపీఎల్ 2024 తొలిపోరులో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించింది. చెపాక్ స్టేడియంపై తమకు తిరుగులేదని నిరూపించింది. ఆర్సీబీ మరోసారి బోర్లా పడింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 23, 2024, 06:33 AM IST
IPL 2024 CSK vs RCB: మొదటి మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమికి కారణమేంటి

IPL 2024 CSK vs RCB: ఐపీఎల్ 2024 ప్రారంభ మ్యాచ్ సీఎస్కే వర్సెస్ ఆర్సీబీ పోరులో చెన్నై సూపర్ కింగ్స్ 4 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై విజయం సాధించింది. ఈసారైనా టైటిల్ సాధించాలనే కసితో బరిలో దిగిన ఆర్సీబీకు మొదట్లోనే నిరాశ ఎదురైంది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఓటమికి కారణమేంటో విశ్లేషించాడు. 

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీ ఇన్నింగ్స్ ధాటిగా ఆరంభించినా సీఎస్కే పేసర్ ముస్తఫీజుర్ రెహ్మాన్ ముందు తలవంచేశారు. 4 ఓవర్లు చేసిన ముస్తఫీజుర్ రెహ్మాన్ 29 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. రచిన్ రవీంద్ర, రహానే అద్భుతమైన ఫీల్డింగ్‌తో కోహ్లీ, డుప్లెసిస్ వెనుదిరిగారు. మ్యాక్స్‌వెల్ డకౌట్ అయ్యాడు. కీలకమైన వికెట్లు పోగొట్టుకున్న ఆర్సీబీకు దినేష్ కార్తీక్, అనూజ్ రావత్ ఆదుకున్నారు. చివరి 3 ఓవర్లలో దాదాపుగా 50 పరుగులు చేయడంతో ఆర్సీబీ కనీసం 173 పరుగులు చేయగలిగింది. సీఎస్కేలాంటి జట్టుకు ఇది పెద్ద స్కోరు కాకపోవడంతో చేదించేందుకు పెద్దగా కష్టపడలేదు. రచిన్ రవీంద్ర, రవీంద్ర జడేజా, దూబే విరుచుకుపడటంతో సీఎస్కే తొలి విజయం ఖాతాలో వేసుకుంది. 

మొదటి మ్యాచ్‌లోనే ఓటమి పాలవడంపై ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ స్పందించాడు. బ్యాటింగ్ వైఫల్యమే కారణమని చెప్పాడు. మరో 15-20 పరుగులు చేసుంటే విజయం తమవైపుండేదన్నాడు. ఓటమికి కారణం ఇదేనన్నాడు. మిడిల్ ఓవర్లలో చెన్నై జట్టు అద్భుతంగా ఆడుతోందని, స్పిన్నర్లతో ఇబ్బంది కలగజేస్తోందని చెప్పాడు. కొన్ని వికెట్లు తీసే ప్రయత్నం చేసినా డిఫెండ్ చేసుకునేంత స్కోరు లేకపోయిందన్నాడు. ఈ పిచ్‌పై మొదట బ్యాటింగ్ చేసిన జట్లు గతంలో భారీ స్కోర్లు సాధించాయని, తాము ఆ పని చేయలేకపోయామన్నాడు. 

Also read: Moscow Gun Firing: మాస్కోలో దారుణం, దుండగుల కాల్పుల్లో 40 మంది మృతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News